రాజమౌళి కంటే 40 ఏళ్ల ముందే ఆ రికార్డ్ కె. విశ్వ‌నాథ్‌కే సొంతం…!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరు ఊహించిన విధంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత సంవత్సరం చివరిలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నటులు కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ వంటి అగ్ర న‌టులు మరణించగా.. అప్పటి నుంచి ఇప్పటివరకు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి చివరలో తెలుగు అగ్ర నటి జమున ఈ లోకాన్ని విడిచి వెళ్ళగా, ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమలో మరో దిగ్గజం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.

తెలుగు పరిశ్రమలో దిగ్గజ దర్శకుడు కళాతపస్విగా పేరు తెచ్చుకున్న కే విశ్వనాథ్ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించారు. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలకు జాతీయ అంతర్జాతీయ బహుమతులు ఎన్నో వచ్చాయి. ఆ రోజుల్లోనే విశ్వనాథ్ మన తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకువెళ్లాడు.

రాజమౌళి కంటే ముందే కే విశ్వనాథ్ ఆ ఘన కీర్తిని సంపాదించారు | K Vishwanath  Movie Nominated For Oscar Before Rajamouli Film , K Vishwanath, Kamal  Hassan, Oscar Award, Rajamouli, Shankarabharanam Movie ...

1985 వ సంవత్సరంలో కమలహాసన్ హీరోగా వచ్చిన స్వాతిముత్యం సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది. ఆస్కార్ కి నామినేట్ అయిన తొలి తెలుగు సినిమా కూడా కూడా విశ్వనాధ్ తెరకెక్కిన స్వాతి ముత్యం ఈ ఘనత కూడా ఆయనకే దక్కింది. రాజమౌళి కంటే ముందే విశ్వనాథ్ తన సినిమాలతో ఎన్నో అరుదైన ఘనతల‌ను అందుకున్నారు అందులో ఆస్కార్ ఘనత కూడా ఒకటి.

ఇక ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా మళ్లీ ఆ ఘనత అందుకుంది. ఇక ఆయన దర్శకుడిగా మరియు నటుడుగా ఆయన సాధించిన ఘన కీర్తి ఉన్నత శిఖరం అనడంలో సందేహం లేదు. తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతకాలం ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu Vishwanath, Kamal Hassan, Oscar Award, Rajamouli, Sagara Sangamam, Swathi

తెలుగు సినిమాను ఆస్కార్ కి పరిచయం చేసిన గొప్ప దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కే విశ్వనాథ్ మృతి చెందడం తెలుగు సినీ జగత్తుకి తీరని లోటు. ఆయన లేని లోటు ని మరెవ్వరు కూడా భర్తీ చేయలేరు. ఆయన వేసిన దారిలో వందలాది మంది ఫిలిం మేకర్స్ అడుగులు వేస్తున్నారు. అలా ఆయన సినిమాలు ఎప్పటికీ ఉంటాయి అంటే ఆయన మనతో ఉన్నట్లుగానే భావించవచ్చు.