ప‌వ‌న్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా..? రోజు తిన‌మ‌న్నా తింటాడ‌ట‌!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవ‌ల నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న `అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` టాక్‌ షోలో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఎపిసోడ్ కోసం ప‌వ‌న్ అభిమానులు ఎప్ప‌టి నుంచి ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే అభిమానుల ఎదురు చూపుల‌కు తెర దించుతూ ఆహా టీమ్ ప‌వ‌న్ ఎపిసోడ్ కు సంబంధించిన మొద‌టి భాగాన్ని గుర‌వారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ చేసింది.

ఈ ఎపిసోడ్ అటు అభిమానుల‌ను ఇటు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఈ ఎపిసోడ్ లోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాలు కూడా చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే బాల‌య్య మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కు కాల్ చేశాడు. ఈ సంద‌ర్భంగా బాబాయ్‌తో తనకున్న అనుబంధాన్ని చ‌ర‌ణ్ పంచుకున్నాడు.

`మీ బాబాయ్‌ గురించి ఎవ్వరికి తెలియని సీక్రెట్‌ చెప్పు` అని బాల‌య్య అడ‌గ‌గా.. అందుకు రామ్‌ చరణ్ `బాబాయ్‌ లైఫ్‌ చాలా బోరండి. కాకపోతే బాబాయ్‌కి హైదరాబాద్‌ బిర్యానీ అంటే చాలా ఇష్టం. రోజు తినమన్నా అదే తింటాడు` అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ప‌వ‌న్ ఫేవ‌రెట్ ఫుడ్ హైదరాబాద్‌ బిర్యానీ అని రామ్ చ‌ర‌ణ్ స్ప‌ష్టం చేశాడు. అలాగే తాను చిన్న‌త‌నం నుంచి క‌ళ్యాణ్ బాబాయ్ వ‌ద్దే పెరిగాన‌ని, బాబాయ్ తో త‌న‌కు మంచి బాండింగ్ ఉంద‌ని చ‌ర‌ణ్ చెప్పుకొచ్చారు. ఇక ఒక‌సారి వెకేష‌న్ కోసం సింగపూర్ వెళ్లిన‌ప్పుడు తాను వాంతులు చేసుకుంటే బాబాయ్ స్వ‌యంగా క్లీన్ చేశాడ‌ని ఆనాటి రోజుల‌ను చ‌ర‌ణ్ గుర్తు చేసుకున్నాడు.