చిరంజీవి కెరీర్‌లో ఆ సినిమా నుంచి ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

సాధారణంగా ఏ చిత్ర పరిశ్రమలో అయినా సరే ఓ సినిమా షూటింగ్ పూర్తి కావాలంటే దాదాపు ఓ సంవత్సరం టైమ్‌ పడుతుంది. దర్శక ధీరుడు రాజమౌళి లాంటి డైరెక్టర్లకైతే ఏకంగా మూడు నుంచి నాలుగు సంవత్సరాల టైమ్‌ పడుతుంది. అయితే చిరంజీవి తన కెరీర్ లో ఓ సినిమాను మాత్రం కేవలం 29 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ ఇంట్ర‌స్టింగ్ మ్యాట‌ర్ ఏంటో తెలుసుకుందాం.

తెలుగు లెజెండ్రీ దర్శకులలో కోడి రామకృష్ణ కూడా ఒకరు. ఆయన దర్శకత్వంలో చిరంజీవి హీరోగా, మాధవి హీరోయిన్‌గా 1982లో తెరకెక్కిన సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ప్రతాప్ ఆర్ట్స్ బ్యానర్ పై కె. రాఘవ నిర్మించిన ఈ సినిమాను డైరెక్టర్ గా కోడి రామకృష్ణకు, నటుడుగా గొల్లపూడి మారుతి రావుకు మొదటి సినిమా. 1982 ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని విజయాన్ని అందుకుంది.

Intlo Ramayya Veedhilo Krishnayya Movie | ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య |  Chiranjeevi | Madhavi - YouTube

ఏకంగా 512 రోజులు ఆడిన ఈ సినిమా చిరంజీవి కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్. దర్శకుడు కోడి రామకృష్ణ ఈ సినిమాలో చిరంజీవిని తన ఇమేజ్‌కు భిన్నంగా చూపించడమే కాదు కేవలం 29 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయాడు. రూ.3.25 లక్షలతో ఈ సినిమా షూటింగ్ భీమవరం, పాడేరు మద్రాస్, పాలకొల్లు, సఖినేటిపల్లి వంటి ప్రాంతాల్లో జరిగింది.

Kodi Ramakrishna Memorises His Thoughts About Chiranjeevi - video  Dailymotion

సినిమా షూటింగ్ పూర్తయ్యాక సెన్సార్ విషయంలో ఇబ్బందులు రావటంతో పట్టు మరి ఈ సినిమా ప్రొడ్యూసర్ రాఘవ సెన్సార్ సభ్యుల నుంచి బయటపడ్డారు. అలా ఈ సినిమా విడుదలై 8 కేంద్రాల్లో 50 రోజుల ఆడి.. రెండు కేంద్రాల్లో వంద రోజులు ఆడి మంచి కలెక్షన్లను రాబట్టుకుంది. హైదరాబాద్ వంటి మహానగరంలో ఈ సినిమా ఏకంగా 512 రోజులు ఆడింది. ఇలా ఈ విధంగా ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని దక్కించుకుంది.