దర్శక ధీరుడు రాజమౌళి అంటే తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో నేషనల్ వైడ్ గానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ నామినేషన్ లో కూడా నిలిచారు. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్లకి ఎంపికైంది. అంతేకాకుండా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను రాజమౌళి దక్కించుకున్నాడు.
రాజమౌళి మీ సక్సెస్ సీక్రెట్ ఏమిటని అడిగితే.. తన ఫ్యామిలీ అని చెబుతాడు. రాజమౌళి ఏదైనా సినిమా చేస్తున్నారంటే అందులో ఆయన ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అవుతారు. మరి ప్రధానంగా రాజమౌళి భార్య రమా ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటూ తన భర్తకు సపోర్టుగా ఉంటుంది. అదేవిధంగా రమా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ రాజమౌళి సినిమాలో ఎంతో స్పెషల్ గా నిలుస్తుంటాయి.
ఇకపోతే రాజమౌళి, రమా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. అయితే ఇప్పుడు తెలియని విషయం ఏమిటంటే..రమా రాజమౌళి కి ఇది రెండో వివాహం.. రాజమౌళి కంటే ముందే రమాకు మరో వ్యక్తితో వివాహం జరిగింది. రమా తన మొదటి పెళ్లి ద్వారా కలిగిన సంతానమే కార్తికేయ. అయితే కార్తికేయ పుట్టిన సమయం నుంచి తన మొదటి భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
అప్పటికే పెళ్లి జరిగి ఒక కొడుకు ఉన్నా విడాకులు తీసుకున్న రమాను రాజమౌళి ప్రేమించి పెళ్లి చేసున్నాడు. రాజమౌళి సోదరుడు కీరవాణి భార్య శ్రీవల్లికి, రమా సొంత చెల్లెలు. తన మొదటి భర్తతో విడాకులు తీసుకున్న దగ్గర నుంచి రమా తన అక్క శ్రీవల్లి దగ్గరే ఉండేది. ఇక అదే విధంగా రాజమౌళి కూడా తన అన్న కీరవాణి ఇంటికి వెళ్లేవారు..అక్కడే వీరి మధ్య పరిచయానికి బీజం పడింది. ఆ పరిచయం కాస్త రాజమౌళి- రమామ మధ్య ప్రేమగా మారింది.
ఎంతో కష్టం మీద పెద్దలను ఒప్పించి వీరిద్దరూ 2001లో పెళ్లి చేసుకున్నారు. వివాహమైన తర్వాత పిల్లలు వద్దనుకున్న రాజమౌళి దంపతులు ఓ పాపను దత్తత తీసుకున్నారు ఆమె మముఖ.. రాజమౌళి వివాహం తర్వాత నుంచి సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశాలు వచ్చాయి. అలా ఇప్పుడు అంచెలంచలుగా ఎదుగుతూ దేశం గర్వించదగ్గ దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు.