నంద‌మూరి తార‌క‌ర‌త్న ఆస్తుల విలువ ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే షాకే!?

నందమూరి తారకరత్న క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. గుండెపోటుతో ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివ‌ర‌కు గ‌త శ‌నివారం రాత్రి తుది శ్వాస విడిచారు. 39 ఏళ్ల వయసుకే తనువు చాలించి కన్నవారికి కడుపుకోత మిగిల్చారు. క‌ట్టుకున్న భార్య‌ను, పిల్ల‌ల‌ను ఒంట‌రివారిని చేసి వెళ్లిపోయారు.

సోమ‌వారం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలను పూర్తి చేశారు..తారకరత్న అకాల మరణం అటు నంద‌మూరి కుటుంబంతో పాటు ఇటు చిత్రపరిశ్రమలోనూ తీవ్ర విషాదం నింపింది. తారకరత్న తిరిగిరానిలోకాలకు చేరుకోవడంతో అభిమానులు ఆయ‌న పాత జ్ఞాపకాలను నెమ‌ర‌వేసుకుంటూ క‌న్నీరు మున్నీరు అవుతున్నారు.

ఇక‌పోతే తార‌క‌ర‌త్న ఆస్తుల వివ‌రాలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. న‌టుడిగా తార‌క‌ర‌త్న సంపాదించింది త‌క్కువే. కానీ, ఆయ‌న‌కు హోట‌ల్ వ్యాపార‌లు ఉన్నాయ‌ట‌. అలాగే సొంత థియేట‌ర్లు, క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ లు ఉన్నాయట‌. ఇలా ప‌లు వ్యాపారాల ద్వారా తార‌క‌ర‌త్న బాగానే సంపాదించాట‌. ఈయ‌న ఆస్తుల విలువ దాదాపు రూ. 1500 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.