భారతీయ సినిమాకి సామాజిక బాధ్యతను గుర్తుచేసిన భారీ సినిమాల దర్శకులలో శంకర్ కూడా ఒకరు.. భారతీయుడు, రోబో, అపరిచితుడు సినిమాలతో శంకర్ ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. విక్రమ్ హీరోగా వచ్చిన ఐ సినిమా మాత్రం శంకర్ కు గట్టి దెబ్బ కొట్టింది. ఆ తర్వాత రజినీకాంత్ హీరోగా 2.0 సినిమా బాగున్నా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఇప్పుడు ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ హీరోగా ఓ భారీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను పొలిటికల్ డ్రామాగా శంకర్ తీసుకొస్తున్నాడు. ఈ సినిమాను శంకర్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ విషయం ఇలా ఉంచితే శంకర్ దర్శకత్వంలో చిరంజీవి కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన ఒకే ఒక్కడు సినిమాలో చిరంజీవి హీరోగా నటించాల్సి ఉంది.
శంకర్ ముందుగా ఈ సినిమాలో హీరోగా చిరంజీవిని అనుకున్నారు. చిరంజీవిని కూడా సంప్రదించగా అప్పటికే చిరు వేరే సినిమాలకు కమిట్ అవ్వడంతో చిరు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత శంకర్ ఈ సినిమా అర్జున్ ని హీరోగా పెట్టి తెరకెక్కించాడు. అలా వచ్చిన ఒకే ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
ఈ సినిమా సక్సెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. శంకర్ తో నన్ను సినిమా చేయమని రజిని సార్ చెప్పారని శంకర్ సినిమా ఇప్పుడు చేద్దామంటే నేను రెడీ అంటూ చెప్పుకోవచ్చారు. చిరు చేసిన ఈ పెద్ద తప్పుతో ఓ మంచి పాన్ ఇండియా హిట్ మిస్ అయిపోయాడు. ఇక ప్రస్తుతం చరణ్ తో శంకర్ సినిమా చేస్తున్నాడు. మరి ఈ గ్యాప్ లోనే శంకర్ చిరు కోసం కూడా ఓ కథను రాసుకుని ఒప్పిస్తే వారిద్దరి కాంబో సినిమా వచ్చినట్టే. మరి రాబోయే రోజులు ఏమి జరుగుతుందో చూడాలి.