కడప వైసీపీలో రచ్చ..నేతల పోరుతో రిస్క్..!

సీఎం జగన్ సొంత జిల్లా కడపలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువగా కనిపిస్తుంది. ఉండటానికి ఇక్కడ 10 స్థానాల్లో 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు..జిల్లాలో వైసీపీ హవానే ఉంది. కానీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో నిదానంగా ఆధిపత్య పోరు పెరుగుతూ వస్తుంది. కొన్ని స్థానాల్లో నేతలు గ్రూపులుగా విడిపోయే సెపరేట్ గా రాజకీయాలు చేస్తున్నారు. ఈ జిల్లాలో టీడీపీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. కానీ అంతకంటే వైసీపీలో ఈ రచ్చ ఎక్కువ కనిపిస్తోంది.

మొదట ఆధిపత్య పోరు ఎక్కువ కనిపిస్తున్న స్థానం ప్రొద్దుటూరు..ఇక్కడ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తితి. ఇప్పటికే రమేశ్ వర్గం…ఎమ్మెల్యే వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఇద్దరు కౌన్సిలర్లని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వారు ఇప్పుడు మరింత వ్యతిరేకంగా తయారై..ఎమ్మెల్యేకు యాంటీగా ఉన్నారు.

అటు కడపలో మంత్రి అంజాద్ బాషా , మేయర్, కమలాపురం ఎమ్మెల్యే వర్గాలు ఉన్నాయి. ఈ మూడు వర్గాల మధ్య అక్కడ రచ్చ జరుగుతుంది. ఇక జమ్మలమడుగులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి పడటం లేదు. సుబ్బారెడ్డి టీడీపీ నుంచి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ రెండు వర్గాల మధ్య రచ్చ ఉంది. ఇక బద్వేలులో ఎమ్మెల్యే సుధ, ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి వర్గాలకు పొసగని పరిస్తితి.

ఇక జగన్ మేనమామ రవీంద్రానాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే కమలాపురంలో అదే పరిస్తితి. ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మన్ మల్లిఖార్జున్ రెడ్డి వర్గాలకు పడని పరిస్తితి. ఈ వర్గ పోరు ఇలా కడపలో కొనసాగుతూనే ఉంది. ఎన్నికల వరకు ఇలాగే పరిస్తితి ఉంటే వైసీపీకి డ్యామేజ్ అయ్యేలా ఉంది.