హరిహర వీరమల్లు సినిమా టీజర్ వచ్చేది ఆరోజే..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతోనూ మరోవైపు రాజకీయాలతోను బిజీబిజీగా ఉంటున్నారు. ఈమధ్య కాలంలో క్రిస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర హర వీరమల్లు సినిమా షూటింగ్ ఇంకా పూర్తిగా అవ్వలేదు.. దాదాపుగా ఈ సినిమా మొదలుపెట్టి ఇప్పటికే రెండేళ్లు పైగా కావస్తోంది.. అయినప్పటికీ ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది .అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే షూటింగ్స్ పార్ట్ నుంచి వచ్చిన ఫొటోస్ పవన్ లుక్ సినిమా ఈ సినిమా పై భారీ అంచనాలను నెలకొన్నాయి.

AM Rathnam confirms Hari Hara Veera Mallu's teaser date | 123telugu.com
ఇంకా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఒక బందిపోటు క్యారెక్టర్ అన్నట్లుగా తెలుస్తోంది. ఈ కథ మేఘల్ రాజుల కాలం నాటి కథ. ఇందులో బాలీవుడ్ నటుడు మరో బాలీవుడ్ నటి, నిధి అగర్వాల్, మరికొంతమంది స్టార్స్ నటిస్తున్నారు. హర హర వీరమల్లు టీజర్ ని రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి నిర్మాతగా ఏ ఎం రత్నం తన స్నేహితుల వద్ద హర హర వీరమల్లు టీజర్ ని రిపబ్లిక్ డే రోజు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారట .

Hari Hara Veera Mallu: Nidhhi Agerwal's first regal look as Panchami is a  perfect birthday gift to fans | PINKVILLA
అలాగే ఆహాలో ఓటిటిలో వస్తున్న బాలయ్య ఆన్ స్టాపబుల్ షో కి పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పవర్ ఫుల్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఫుల్ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హర హర వీరమల్లు టీజర్ అలాగే ఆన్ స్టాపబుల్ షో రెండు ఒకటే రోజు రిలీజ్ అవుతాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.అయితే ఈ విషయం ఎంతవరకు నిజమో రిపబ్లిక్ డే రోజు వరకు వెయిట్ చేయాల్సిందే.