ఆ విషయంలో తమ్ముడిని తొక్కేస్తున్న కళ్యాణ్ రామ్.. అసలు మ్యాటర్ ఏమిటంటే..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ తరం నటులలో గొప్ప నటులలో తారక్ ఒకరిని అందరూ భావిస్తారు. నటన విషయంలో తారక్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే.. తన కళ్ళతో సైతం హావభావాలు పలికిస్తాడనే టాక్ ఉంది. దీనికి ఉదాహరణ త్రిబుల్ ఆర్ సినిమాలోని కొమరం భీముడు సాంగ్‌లో తారక్ నటనతో ప్రపంచంలో ఉన్న సినీ అభిమానులందరూ మైమరచిపోయారు. ఈ నటనకు గాను ఎన్టీఆర్ ఆస్కార్ కూడా నామినేట్ అయ్యారు.

ఇప్పుడు నటన విషయంలో ఎన్టీఆర్‌కు కళ్యాణ్ రామ్ నుంచి గట్టి పోటీ రాబోతుందనే కామెంట్లు వస్తున్నాయి. కళ్యాణ్ రామ్ తాజా చిత్రం ‘అమిగోస్’ రీసెంట్ గానే ఈ సినిమాలోని టీజర్, సాంగ్ విడుదల చేయగా అవి చూసిన నెటిజన్లు ఇలాంటి కామెంట్లు చేయడం గమనార్హం. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు విభజనమైన పాత్రలో కనిపించబోతున్నాడు. టీజర్, సాంగ్ లో కూడా కళ్యాణ్ రామ్ యాక్టింగ్ మరో లెవెల్ లో ఉందని కామెంట్లు వస్తున్నాయి.

Jr NTR's Heartfelt Birthday Wish for Brother Nandamuri Kalyan Ram Is a Must  See! | 🎥 LatestLY

మూడు క్యారెక్టర్ లోను కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించాడని.. ఈ సినిమా కూడా ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంది అని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. గత సంవత్సరం బింబిసార సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుని సూపర్ ఫామ్ లోకి వచ్చాడు కళ్యాణ్ రామ్. దీంతో ఇప్పుడు ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఎన్టీఆర్‌కు తన అన్నయ్యతోనే గట్టి పోటీ ఎదురవుతుంది.

ఈ అన్నదమ్ముల కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బాగుంటదని అభిమానులు భావిస్తుండగా..
ఈ కాంబినేషన్ ను సెట్ చేసే దర్శకుడు ఎవరో తెలియాల్సి ఉంది. గతంలో ఈ అన్నదమ్ములతో ఒక సినిమా రాబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే కొన్ని అనుకోని కారణాలవల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయిందని తెలుస్తుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ కూడా వరుస సినిమాలతో టాలీవుడ్ లో బిజీగా కొనసాగుతున్నాడు.