నాగార్జున హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. చూస్తే మతులు పోవాల్సిందే..!

చిత్ర పరిశ్రమకు కొంతమంది హీరోయిన్లు మెరుపుతీగ లాగా వస్తారు.. ప్రేక్షకులను మెప్పిస్తారు.. అంతలోనే మాయం అయిపోతారు.. అందం, అభినయం ఉన్నప్పటికీ.. చిత్ర పరిశ్రమకు దూరంగా వెళ్లిపోతారు. ఇప్పుడు ఆ కోవకే చెందిన ఓ హీరోయిన్‌ గురించి తెలుసుకుందాం. అక్కినేని అందగాడు కింగ్ నాగార్జున తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు.. ఆయన నటించిన సినిమాల్లో ఎన్నో రొమాంటిక్ పాత్రలో నటించి ఆడవాళ్ళ కలల మన్మధుడుగా మారాడు.. ఆయన న‌టించిన‌ క్లాసికల్ రొమాంటిక్ సినిమా మన్మధుడు.

Manmadhudu ~ Complete Wiki | Ratings | Photos | Videos | Cast

ఈ సినిమా చూడని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. విజయ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాకి త్రివిక్రమ్‌ స్టోరీ, డైలాగ్స్ అందించాడు. నాగార్జున కెరీర్ లోననే ఓ క్లాసికల్ మూవీ.. ఈ సినిమా ఎప్పుడు బుల్లితెరపై వచ్చిన ప్రేక్షకులు ఆ సినిమాలో లీనమైపోతుంటారు. ఈ సినిమాలో నాగార్జునకు జంటగా సోనాలి బింద్రే, అన్షు అంబానీ హీరోయిన్స్ గా నటించారు. ఇద్దరు ముద్దుగుమ్మలతోనూ నాగార్జున రొమాన్స్ ఎంతో అద్భుతంగా ఉంటుంది.

ప్రధానంగా చెప్పాలంటే.. అన్షు పాత్ర చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ.. ఆమె క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది. సినిమా పూర్తయిన తర్వాత కూడా ప్రతి ఆడియన్స్ కి ఆమె క్యారెక్టర్ గుర్తు వస్తూనే ఉంటుంది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకుంది అన్షు. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా హీరో ప్రభాస్ తొలి సినిమా రాఘవేంద్రాలో నటించింది. అయితే ఆమె నటించిన‌ రెండు సినిమాలలోను ఆమె మరణించే క్యారెక్టర్ లోనే నటించింది.

Actress anshu ambani glamorous pics | Actress Anshu Ambani Glamorous Pics - Actressanshu, Anshu Ambani, Anshuambani

ఆ తర్వాత శివాజీ హీరోగా వచ్చిన మిస్సమ్మ సినిమాలో కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటించింది. చాలా తక్కువ సినిమాలు చేసిన అన్షు.. తర్వాత లండన్ వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయింది.. అక్కడే పుట్టి పెరిగిన.. సినిమా పరిశ్రమకు ఈమె ఓ మెరుపుతీగ లాగా వచ్చి వెళ్లిపోయింది. లండన్ లో ప్రముఖ వ్యాపారివేత అయిన సచిన్ సగ్గార్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప, బాబు కూడా ఉన్నారు. సినిమాలకు దూరమయ్యాక ఈమె లండన్‌లో ఇన్‌స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాప్‌ను ర‌న్ చేస్తుంది. ఇక సినిమాల్లో నటించి 20 ఏళ్లు అవుతున్న ఇప్పటికి ఈమె అందంలో చెక్కుచెదరలేదు.. సోషల్ మీడియాలో బికినీతో దర్శనమిచ్చి నెటిజెన్లకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈమె బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Anshu (@actressanshuofficial)