ఆ ప్లాఫ్ హీరోయిన్ కోసం ఎంతైనా ఖర్చు పెడతాం అంటున్న తెలుగు మేకర్స్..!

అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లో హీరోయిన్‌గా పరిచయమైన జాన్వీ కపూర్ ఇప్పటికీ ఓ సాలిడ్ సక్సెస్‌ను అందుకోలేకపోయింది. ఆమె ఇండస్ట్రీ లోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఎన్ని సినిమాల్లో నటించినా ఆమె అనుకున్న స్థానానికి దక్కించుకోలేకపోయింది. ఓటీటీ సినిమాలు మరియు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ హిట్ కోసం ఎదురుచూస్తున్న జాన్వి కపూర్ కి తెలుగులో మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంది. రీసెంట్‌గా టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోకి జంటగా నటించేందుకు ఏకంగా రెండు కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది.

ఇంత మొత్తం రెమ్యూనరేషన్ ఒక ఫెయిల్యూర్ హీరోయిన్ కి ఇవ్వటం ఏంటి అని సినీ విశేషలకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం శ్రీదేవి కూతురు అనే ఒకే ఒక కారణంతో జాన్వి కాపూర్ ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బాలీవుడ్ లో తన సినిమాలతో ఆకట్టుకోలేక పోయినా వరుస అపజయాలను మూట కట్టుకున్న.. టాలీవుడ్ ఫిలిం మేకర్స్ మాత్రం తెగ ఇష్టపడుతున్నారు. కేవలం టాలీవుడ్ ఫిలిం మేకర్స్‌ మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఈమెను ఇష్టపడతారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Janhvi Kapoor To Make Telugu Movie Debut Opposite Ram Charan In Buchi Babu  Sana's Pan-India

అందుకే ఎన్టీఆర్- కొరటాల మూవీలో జాన్వి కపూర్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. వీటితోపాటు రామ్ చరణ్- బుచ్చిబాబు సినిమాలో కూడా జాన్వి కాపుర్‌ను హీరోయిన్‌గా సెలెక్ట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు తో జాన్వి కపూర్ ఈ సంవత్సరం లేద‌ వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే మాత్రం ఈమె రెమ్యూనరేషన్ రెండో నుంచి నాలుగు కోట్లకు పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం జాన్వి బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.