“వాల్తేరు వీరయ్య” లో ఉన్నది..”వీర సింహా రెడ్డి” లో లేనిది ఇదే.. ఫ్యాన్స్ డోంట్ మిస్..!!

ఎప్పుడు లేని విధంగా ఈసారి సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద టఫ్ ఫైట్ నెలకొంది. నందమూరి బాలయ్య హీరోగా నటించిన వీరసింహ రెడ్డి సినిమా జనవరి 12వ తేదీన గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయింది . అంతేకాదు ఆ సినిమా రిలీజ్ అయిన 24 గంటలు అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి మాస్ హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య కూడా థియేటర్స్ లో సందడి చేసింది . దీంతో వీర సిం హా రెడ్డి – వాల్తేరు వీరయ్య హాష్ ట్యాగ్ ల తో పాటు సినిమాలో ఉన్న ప్లస్ లు మైనస్లు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే నిన్న బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా రిలీజ్ అయి ఎంత బిగ్గెస్ట్ పాజిటివ్ టాక్ ను అందుకుందో.. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నెగిటివ్ అన్న పదానికి తావు లేకుండా బాలయ్య తనదైన స్టైల్ లో కర్త – కర్మ – క్రియ తానై సినిమాను నిలబెట్టాడు . కాగా వీర సింహారెడ్డి సినిమా కూడా హ్యూజ్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది . చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మాస్ లుక్ లో చిరంజీవిని చూసేసరికి మెగా ఫాన్స్ కు పూనకాలు వచ్చేస్తున్నాయి .

అయితే ఈ రెండు సినిమాలను కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీరసింహారెడ్డి సినిమాలో కన్నా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య లో కామెడీ కంటెంట్ ఎక్కువగా ఉంది అంటున్నారు జనాలు . వీరసింహారెడ్డి సినిమాలో మొత్తం మాస్ పవర్ పొలిటికల్ పంచ్ డైలాగ్స్ తో బాలయ్య ఆకట్టుకున్నాడు . బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలో కామెడీ అనేది లేదు . మొత్తం యాక్షన్స్.. ఫ్యామిలీ సెంటిమెంట్ ..పవర్ పొలిటికల్ డైలాగ్స్ వీటితోనే నెట్టుకు వచ్చేసాడు గోపీచంద్ మలినేని .

అదే వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే మాత్రం ఫుల్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ గా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా శృతిహాసన్ చిరంజీవిల మధ్య వచ్చే సీన్స్ సినిమాకి హైలెట్ గా మాతాయి. అంతేకాదు రవితేజ చిరంజీవి మధ్య వచ్చే డైలాగ్ డెలివరీ పంచెస్ జనాలకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి . ఈ క్రమంలోనే వాల్తేరు వీరయ్య లో ఉన్న కామెడీ కంటెంట్ వీరసింహారెడ్డిలో లేదని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటాయో .. రియల్ సంక్రాంతి హీరోగా ఎవరు నిలబడతారో..?