వాట్..వాల్తేరు వీరయ్య ఎన్టీఆర్ సినిమాకు కాపీనా..అడ్డంగా బుక్ అయ్యాడుగా..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా జనవరి 11 ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా శృతిహాసన్ నటించింది. ఇక మాస్ మహారాజా రవితేజ కూడా ఈ సినిమాలో ఒకీలక పాత్రలో చిరంజీవి తమ్ముడుగా నటించాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య వయసెంతో కనిపెట్టలేమయ్య.. చిరు లుక్స్‌‌కి ఫ్యాన్స్ ఫిదా

ఈ సినిమాలో వినల్ గా ప్రకాష్ రాజ్, బాబీ సింహా నటించారు. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికొస్తే మొదటి రోజు భారీ వసూలు సాధించింది. అయితే ఇప్పుడు నెటిజెన్లు ఈ సినిమా మీద మాత్రం ఓ కొత్త రకమైన ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అదేమిటంటే ఈ సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవల్లి సినిమాకి పోలికలు ఉన్నాయి అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

గమనించండి: 'వాల్తేరు వీరయ్య' ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక మారింది

ఇక వాల్తేరు వీరయ్య కథ విషయానికి వస్తే ఈ సినిమాలో చిరంజీవి తమ్ముడుగా పోలీస్ పాత్రలో రవితేజ అనుకోకుండా తన చేయని తప్పుకు డిపార్ట్మెంట్ దృష్టిలో విలన్ గా ముద్ర వేయించుకుంటాడు. రవితేజ చనిపోయిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో అతనికి కర్మకాండలు చేయరు. ఒక దేశద్రోహి అన్నట్లుగా ముద్ర వేస్తారు. దానికి ప్రధాన కారణం విలన్ ప్రకాష్ రాజ్. అయితే దానికి చిరంజీవి కారణమని భావిస్తుంది రవితేజ భార్య. చిరంజీవి ముఖం తన జీవితంలో చూపించొద్దు అని చెప్పి విదేశాలకు వెళ్లిపోయి సెటిల్ అవుద్ది.

Ravi Teja's first look from Waltair Veerayya to be out on this date- Cinema express

అయితే చిరంజీవి ఎక్కడో మలేషియాలో ఉన్న ప్రకాష్ రాజ్ ని ఇండియా తీసుకొచ్చి ఎలా రవితేజ మరణానికి న్యాయం చేశాడు? పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టిలో రవితేజ వీర మరణం పొందినట్టు ఎలా చేశాడో? అనే విధంగా కథ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ కథ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవల్లి సినిమా స్టోరీ లాగా ఉందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ డబ్బు కోసం ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధమయ్యే రౌడీలా ఉంటాడు.

Oosaravelli Jr NTR,Tamannah

ఈ సినిమాలో తమన్నా బ్రదర్ కిక్ శ్యామ్, విలన్ ప్రకాష్ రాజ్ చేతులు చనిపోతాడు. అతను పోలీస్ డిపార్ట్మెంట్కు ద్రోహం చేశాడని భావించిన పోలీసులు అతనిని కూడా ద్రోహిగా ప్రకటిస్తుంది. ఎలాంటి ప్రభుత్వ లాంఛనాలు లేకుండా అతని కర్మకాండలు చేయిస్తారు. ఒక సందర్భంలో తమన్న ఎన్టీఆర్‌ను కలిసి ఈ విషయం అంతా చెప్పి తన పగటి తీర్చమని అడుగుతుంది. ఎన్టీఆర్ తన మాటకోసం ఎంత దూరమైనా వెళ్లి విల‌న్స్‌ను రప్పించి వాళ్లని అంతం చేస్తాడు.

Waltair Veerayya Freemake: వాల్తేరు వీరయ్య 'ఊసరవెల్లి' సినిమా ఫ్రీమేకా.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

ఇప్పుడు వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా చిరంజీవి తన తమ్ముడు రవితేజ నిజాయితీని నిరూపించడం కోసం ఎంత దూరమైనా వెళ్లి విల‌న్స్‌ను రప్పించి వారిని అంతం చేస్తాడు. అలాగే ఊసరవెల్లి సినిమాలో ఎన్టీఆర్ మద్యం సేవించినప్పుడు తండ్రి పాత్రలో ఉన్న షయాజీ షిండే ఆత్మకనిపిస్తుందో. వీరయ్య సినిమాలో కూడా చిరంజీవి మద్యం సేవించినప్పుడు తన తండ్రి సత్యరాజ్ ఆత్మ కనిపిస్తూ ఉంటుంది. ఇలా కథపరంగా ఒకటి కాకపోయినా లైన్ ఒకటే ఉందంటూ చిరంజీవి- ఎన్టీఆర్ సినిమాను కాపీ కొట్టి తీశాడు అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.