సంక్రాంతి 4 సినిమాల టార్గెట్ ఇదే ..!!

ఈ ఏడాది సంక్రాంతి లో సౌత్ హిస్టరీలో చాలా స్పెషల్ గా నిలవబోతోంది. ఎందుకంటే ఒకవైపు తమిళంలో స్టార్ హీరోల పోటీ జరుగుతూ ఉండగా.. మరొకవైపు టాలీవుడ్ లోనే సీనియర్ స్టార్ హీరోల మధ్య తీవ్రమైన పోటీ నెలకొననుంది. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నది. సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలలో ఏ సినిమా ఎంత థియేట్రికల్ బిజినెస్ చేసింది అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సంక్రాంతి వార్: ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కాయో తెలుసా.. మైండ్ బ్లాక్  అవ్వాల్సిందే..! - Telugu Journalist

ముందుగా విజయ్ నటించిన వారసుడు సినిమా విషయానికి వస్తే తెలుగు ,తమిళంలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ముందుగా జనవరి 11న ఈ సినిమాని తమిళంలో విడుదల చేయబోతున్నారు.14న తెలుగులో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.140 కోట్లు బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇక తర్వాత చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా కూడా జనవరి 13వ తేదీన రాబోతోంది. ఈ సినిమా కూడా రూ.90 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను అందుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరొక హీరో అజిత్ నటించిన తెగింపు/తునివు కూడా రెండు భాషల్లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం.

ఈ సినిమా కూడా రూ .85 కోట్లకు పైగా థియేట్రీకల్ బిజినెస్ జరిగినట్లుగా సమాచారం. ఇక చివరిగా మిగిలింది బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా. ఈ సినిమా బాలకృష్ణ మార్కెట్కు తగ్గట్టుగానే రూ.72 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా సమాచారం. మరి ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ టార్గెట్ ను పూర్తిగా చేస్తాయేమో చూడాలి. మరి నాలుగు సినిమాల్లో ఏది ఎక్కువ స్థాయిలో కలెక్షన్లను అందుకుంటుందో చూడాలి.