హిట్ కోసం నచ్చని పని చేస్తున్న పూజా హెగ్డే.. ముంచినా , తేల్చినా ఆ దేవుడే దిక్కు..!!

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు. ప్రజెంట్ ఎలాంటి కష్ట పరిస్థితిలో ఉందో అందరికీ తెలిసిందే . గత ఏడాది ఆమె నటించిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి . కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో చేసిన బీస్ట్ అట్టర్ ఫ్లాప్ అయింది . ప్రభాస్ తో చేసిన రాధే శ్యామ్, చరణ్ తో చేసిన ఆచార్య ఆమెకు నెగిటివ్ టాక్ ను తెచ్చిపెట్టాయి .

అయితే ఎన్నో ఆశలతో బాలీవుడ్ లో చేసిన సినిమా సైతం పూజ హెగ్డే ఆశలను నిరాశగా మిగిల్చాయి. ఈ క్రమంలోనే పూజా హెగ్డే ఎలాగైనా సరే ఆమె చేస్తున్న సల్మాన్ ఖాన్ సినిమా హిట్ అవ్వాలని డిసైడ్ అయింది. ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే పూజా హెగ్డే కెరీర్ కు ఇక ఫుల్ స్టాప్ పడినట్లే . ఈ క్రమంలోనే పూజలు పునస్కారాలు అంటే పడని పూజా హెగ్డే హిట్ కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తుందట .

అంతేకాదు రీసెంట్ గానే హైదరాబాదులోని పెద్దమ్మ తల్లి టెంపుల్ దర్శించుకుంది. ఇంట్లో హోమాలు వేయడానికి కూడా సిద్ధపడిందట. ప్రత్యేక పూజలు చేయిస్తుందట. దీంతో పూజా హెగ్డే ఈసారి హిట్ కోసం చాలా ట్రై చేస్తుందని ..ముంచినా తేల్చినా ఇక ఆ దేవుడే ఆమెకు దిక్కు అంటూ జనాలు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి పూజ హెగ్డే ..సల్మాన్ ఖాన్ సినిమాతో ఎలాంటి హిట్ను తన ఖాతాలో వేసుకోబోతుందో..? . ప్రజెంట్ తెలుగులో మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తుంది ఈ బ్యూటీ..!!

 

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)