ఎట్టకేలకు డీజే టిల్లు-2 లో అనుపమను ఒప్పించారా..?

గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న చిత్రాలలో డీజె టిల్లు సినిమా కూడా ఒకటి. విమల్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నది. అయితే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించింది మాత్రం సిద్దు జొన్నలగడ్డ. అప్పటివరకు సైడ్ క్యారెక్టర్ లో,విలన్ చేస్తూ వచ్చిన సిద్దు అంతకుముందు హీరోగా పలు చిత్రాలలో నటించిన పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ చివరిగా డీజే టిల్లు సినిమాతో సెన్సేషనల్ హీట్ అందుకున్నారు. దీంతో ఈ సినిమా టిల్లు స్క్వేర్ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.

Anupama Parameswaran to rejoin Tillu Square?- Cinema express

అయితే ఈ సినిమా సీక్వెల్కు డైరెక్టర్ని మార్చడంతో పాటు హీరోయిన్ ని కూడా మార్చేయడం జరిగింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమానీ నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ ని మొదట అనుపమని అనుకున్నారు కానీ ఎందుకో ఈ సినిమా నుంచి ఆమె బయటికి వచ్చేసినట్లుగా వార్తలు వినిపించాయి. ఆ తర్వాత శ్రీ లీల కూడా ఇందులో నటించబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. ఆమె కూడా ఈ చిత్రంలో నటించలేదు. టిల్లు స్క్వేర్ సినిమాలకు హీరోయిన్ కొరత ఏర్పడడంతో హాట్ టాపిక్ గా మారింది

అయితే ఫైనల్ గా టిల్లు స్క్వేర్ మళ్లీ అనుపమ ఫిక్స్ అయినట్లుగా మేకర్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. టిల్లు స్క్వేర్ తో నటిస్తున్న ఈమె ఇంస్టాగ్రామ్ లో కర్లీ హెయిర్ గురించి ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. టిల్లు స్క్వేర్ సెట్ లో తిరిగి జాయిన్ అయినట్టుగా ఈ వీడియోతో కన్ఫామ్ చేసింది అనుపమ పరమేశ్వరన్. మరి ఈ చిత్రంలో ఏమీ నటిస్తుందో లేదో చిత్ర బృందం క్లారిటీ ఇస్తే బాగుంటుంది.