కేసీఆర్‌కు చెక్..పొంగులేటి ట్విస్ట్ మామూలుగా లేదు.!

తెలంగాణ రాజకీయాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఊహించని ట్విస్ట్‌లు ఇస్తున్నారు. ఈయన బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన ఈయనకు..అక్కడ అనుకున్న విధంగా ప్రాధాన్యత దక్కలేదు..అలాగే కీలక పదవులు రాలేదు. అయినా సరే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. కానీ రానున్న రోజుల్లో సీటు పై గ్యారెంటీ లేదు..దీంతో పొంగులేటి కారు పార్టీని వీడటం ఖాయమని తెలుస్తోంది.

అది కూడా ఈ నెల 18న కేసీఆర్ ఖమ్మంలో సభ పెడుతున్న నేపథ్యంలో పొంగులేటి ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకుంటారని ప్రచారం వస్తుంది. కానీ పార్టీ మార్పుపై పూర్తిగా క్లారిటీగా చెప్పడం లేదు. వేరే పార్టీ కండువా కప్పుకోవాలంటే ఢిల్లీకి వెళ్లాలసిన అవసరం లేదు. 2 లక్షల మంది మధ్యలో ఖమ్మంలోనే కండువా కప్పుకుంటానని చెప్పుకొచ్చారు.

అంటే ఖమ్మం వేదికగానే పార్టీ మారడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. కాకపోతే ప్రస్తుతానికి మాత్రం పార్టీ మార్పు లేదంటూ చెప్పుకుని వస్తున్నారు. కానీ ఆయన పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. ఇక ఈయనతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు కీలక నేతలని బీజేపీలోకి తీసుకెళ్లి కేసీఆర్‌కు షాక్ ఇస్తారని సమాచారం.

ఇప్పటికే జిల్లాలో పినపాకకు చెందిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, సత్తుపల్లి- మట్టా దయానంద్‌, వైరా, అశ్వారావుపేటలో తన అనుచరులని, ఇల్లెందులో కోరం కనకయ్యని బీజేపీలోకి తీసుకెళ్తారని ప్రచారం ఉంది. చూడాలి మరి ఎంతమంది కారు నేతలు కమలం పార్టీలోకి వెళ్తారో.