ఖమ్మంలో కారుకు ఆ ఇద్దరి దెబ్బ..రివర్స్.!

ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి పెద్దగా కలిసిరాని జిల్లా అని చెప్పవచ్చు. తెలంగాణలో మిగిలిన 9 ఉమ్మడి జిల్లాలు ఒక ఎత్తు అయితే..ఈ ఖమ్మం జిల్లా మరొక ఎత్తు. బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఏ మాత్రం పట్టు లేని జిల్లా. 2014, 2018 ఎన్నికల్లో జిల్లాలో బి‌ఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బ తగిలింది. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టి‌డి‌పిల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని బి‌ఆర్‌ఎస్ లోకి తీసుకున్నారు. అలాగే పలువురు కీలకమైన నేతలని బి‌ఆర్‌ఎస్ […]

కాంగ్రెస్‌లో చేరికల లిస్ట్ పెద్దదే..సీట్ల సర్దుబాటు ఎలా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి ఊహించని వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు పెద్దగా రేసులో లేని పార్టీ..ఇప్పుడు అనూహ్యంగా పుంజుకుని బి‌ఆర్‌ఎస్ పార్టీకి ధీటుగా ముందుకొస్తుంది. ఇదే సమయంలో బి‌జే‌పి వీక్ అవ్వడంతో ఆ పార్టీలోకి వలసలు ఆగిపోయాయి..వరుసగా కాంగ్రెస్ లోకి చేరికలు మొదలయ్యాయి. పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహ 35 మంది నేతలు ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో అన్న […]

పొంగులేటి-జూపల్లి కాంగ్రెస్‌లోకే..కానీ చిక్కులు తప్పవు.!

చాలా రోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుల వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చిన ఈ ఇద్దరు ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ పెద్ద ఎత్తున సాగింది. ఈ క్రమంలోనే వీరితో బి‌జే‌పి నేతలు పలు సార్లు సంప్రదింపులు జరిపారు. బి‌జే‌పిలోకి రావాలని ఆహ్వానించారు. అటు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వచ్చింది. కానీ ఈ ఇద్దరు ఎటు వెళ్లాలో పూర్తిగా తేల్చుకోలేదు. ఇక కర్నాటక ఎన్నికల ఫలితాలు […]

 పొంగులేటి-జూపల్లి కాంగ్రెస్‌లోకి..బీజేపీకి మూడో స్థానమే.!

తెలంగాణలో మొన్నటివరకు బీజేపీ హడావిడి మామూలుగా లేదనే చెప్పాలి..రెండు ఉపఎన్నికల్లో గెలవడం, పైగా కే‌సి‌ఆర్ సైతం బి‌జే‌పినే టార్గెట్ చేసి రాజకీయం చేయడంతో..ఆ పార్టీ అనుహ్యంగా రేసులోకి వచ్చింది. పైగా కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆ పార్టీకి ఎదురులేకుండా పోయింది. ఇంకా బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టేది బి‌జే‌పి మాత్రమే అని, కాంగ్రెస్ మూడో స్థానానికి వెళ్లిపోయిందని ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ వాస్తవ పరిస్తితులు వేరుగా ఉన్నాయి. తెలంగాణలో బి‌జే‌పి కంటే కాంగ్రెస్ పార్టీనే బలం […]

పొంగులేటి పాలిటిక్స్..కారుని దెబ్బతీయడమే టార్గెట్.!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నారు. బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చిన ఆయన..ఆ పార్టీని దెబ్బతీయడమే టార్గెట్ గా రాజకీయం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆయన ఏదోక పార్టీలో చేరతారని అంతా అనుకున్నారు. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి కలిసి బి‌జే‌పిలోకి వెళ్ళే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. ఇటీవల బి‌జే‌పి నేతలు సైతం..ఈ ఇద్దరితో భేటీ అయ్యారు. బి‌జే‌పిలోకి ఆహ్వానించారు. అటు కాంగ్రెస్ నేతలు సైతం […]

పొంగులేటి-జూపల్లి బీజేపీలోకి కష్టమే..అప్పుడే తేలుస్తారు.!

తెలంగాణలో అధికారంలోకి రావాలని బి‌జే‌పి కలలు కంటున్న విషయం తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉండటంతో తెలంగాణలో రాజకీయంగా దూకుడుగా ముందుకెళుతున్నారు. పైగా అధికారంలో ఉన్న కే‌సి‌ఆర్..బి‌జే‌పిని టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారు. దీంతో బి‌జే‌పి రేసులోకి వచ్చింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కే‌సి‌ఆర్‌ని గద్దె దించి అధికారం సొంతం చేసుకోవాలని బి‌జే‌పి చూస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ బలాన్ని మరింత పెంచేలా ముందుకెళుతున్నారు..ఇతర పార్టీల్లో బలంగా ఉన్న నాయకులని బి‌జే‌పిలోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల బి‌ఆర్‌ఎస్ నుంచి […]

కేసీఆర్‌కు చెక్..పొంగులేటి ట్విస్ట్ మామూలుగా లేదు.!

తెలంగాణ రాజకీయాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఊహించని ట్విస్ట్‌లు ఇస్తున్నారు. ఈయన బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన ఈయనకు..అక్కడ అనుకున్న విధంగా ప్రాధాన్యత దక్కలేదు..అలాగే కీలక పదవులు రాలేదు. అయినా సరే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. కానీ రానున్న రోజుల్లో సీటు పై గ్యారెంటీ లేదు..దీంతో పొంగులేటి కారు పార్టీని వీడటం ఖాయమని తెలుస్తోంది. అది కూడా […]