పొంగులేటి-జూపల్లి కాంగ్రెస్‌లోకే..కానీ చిక్కులు తప్పవు.!

చాలా రోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుల వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చిన ఈ ఇద్దరు ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ పెద్ద ఎత్తున సాగింది. ఈ క్రమంలోనే వీరితో బి‌జే‌పి నేతలు పలు సార్లు సంప్రదింపులు జరిపారు. బి‌జే‌పిలోకి రావాలని ఆహ్వానించారు. అటు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వచ్చింది.

కానీ ఈ ఇద్దరు ఎటు వెళ్లాలో పూర్తిగా తేల్చుకోలేదు. ఇక కర్నాటక ఎన్నికల ఫలితాలు రావడం..అక్కడ కాంగ్రెస్ గెలవడంతో..ఈ ఇద్దరు కాంగ్రెస్ వైపుకు రావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెలాఖరికి కాంగ్రెస్ లో చేరిపోతారని తెలుస్తుంది. అందులో ఎలాంటి డౌట్ కనిపించడం లేదు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోన పొంగులేటి ఖమ్మం జిల్లాలోని తన అనుచరులతో చర్చించి కీలక నిర్ణయం తీసుకొనున్నారు. అయితే జూపల్లి ఇప్పటికే కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయ్యారు.

ఈ ఇద్దరు నెలాఖరికి కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. ఈ ఇద్దరు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ ఉంటుంది అదే సమయంలో కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే..ఖమ్మంలో పొంగులేటితో పాటు తన అనుచర నేతలని కాంగ్రెస్ లోకి తీసుకొస్తారు..వారికి కూడా సీట్లు ఇవ్వాలని అడుగుతున్నారు. ఇటు జూప్పాలి సైతం ఇద్దరు ముగ్గురుని తీసుకొచ్చి వారికి సీట్లు ఇప్పించుకోవాలని చూస్తున్నారు.

అయితే ఇప్పటికే ఆయా సీట్లలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు..వారు సీట్లు ఆశిస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య సీట్ల పంచాయితీ నడవడం ఖాయమని చెప్పవచ్చు. మరి ఏ స్థాయిలో ఈ పంచాయితీ ఉంటుందో రానున్న రోజుల్లో తేలుతుంది.