`ఆదిపురుష్‌`లో హ‌నుమంతుడి రోల్ ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న మైథ‌లాజిక‌ల్‌ మూవీ `ఆదిపురుష్‌`. రామాయణం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్‌ నటిస్తే.. రావణాసురుడి పాత్ర‌ను బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పోషించాడు. జూన్‌16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో అట్టహాసంగా విడుదల కాబోతోంది.

సెన్సార్ ప‌నులు పూర్తి అయ్యాయి. దాదాపు మూడు గంట‌ల నిడివితో ఆదిపురుష్ రాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన‌గా.. ప్రచార కార్యక్రమాలతో మేక‌ర్స్ మరింత హైప్‌ పెంచుతున్నారు. ఆడ్వాన్స్ బుక్కింగ్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో సాగుతున్నాయి. ఇదిలా ఉంది.. ఈ సినిమాలో హనుమంతుడి పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం హాట్ టాపిక్ గా మారింది.

ఆదిపురుష్ లో హ‌నుమంతుడి రోల్ ను దేవదత్త నాగే పోషించించిన సంగ‌తి తెలిసిందే. అయితే మొద‌ట ఆ పాత్ర కోసం డైరెక్ట‌ర్ ఓం రౌత్ చాలా మంది హీరోల‌ను సంప్ర‌దించాడ‌ట‌. ఈ లిస్ట్ లో టాలీవుడ్ స్టార్ రానా ద‌గ్గుబాటి కూడా ఒక‌రని తెలుస్తోంది. అయితే అప్ప‌టికీ అనారోగ్య ప‌రిస్థితుల కార‌ణంగా స‌ర్జ‌రీ చేయించుకున్నాడ‌ట‌. వైద్యులు కొద్ది నెల‌లు షూటింగ్స్ కు దూరంగా ఉండాల‌ని చెప్పార‌ట‌. ఈ కార‌ణంగానే రానాకు `ఆదిపురుష్‌`లో హ‌నుమంతుడి పాత్ర చేయాల‌ని ఉన్నా.. సున్నితంగా రిజెక్ట్ చేశాడ‌ని అంటున్నారు. అన్న‌ట్లు ఆదిపురుష్ టీమ్ హనుమంతునికి అత్యంత భక్తితో కూడిన ఓ అపురూప నివాళి అర్పిస్తోంది. ఆదిపురుష్ ఆడే ప్రతి థియేటర్‌లో ఆ హనుమాన్ కోసం ఒక సీటు కేటాయిస్తారట. దీనికి సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది.