పొంగులేటి-జూపల్లి బీజేపీలోకి కష్టమే..అప్పుడే తేలుస్తారు.!

తెలంగాణలో అధికారంలోకి రావాలని బి‌జే‌పి కలలు కంటున్న విషయం తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉండటంతో తెలంగాణలో రాజకీయంగా దూకుడుగా ముందుకెళుతున్నారు. పైగా అధికారంలో ఉన్న కే‌సి‌ఆర్..బి‌జే‌పిని టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారు. దీంతో బి‌జే‌పి రేసులోకి వచ్చింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కే‌సి‌ఆర్‌ని గద్దె దించి అధికారం సొంతం చేసుకోవాలని బి‌జే‌పి చూస్తుంది.

ఈ క్రమంలోనే పార్టీ బలాన్ని మరింత పెంచేలా ముందుకెళుతున్నారు..ఇతర పార్టీల్లో బలంగా ఉన్న నాయకులని బి‌జే‌పిలోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చిన బడా నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులని బి‌జే‌పిలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ఇద్దరు నేతలతో బి‌జే‌పి చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. వారిద్దరిని బి‌జే‌పిలోకి ఆహ్వానించారు. అలాగే మంచి ఆఫర్లు కూడా ఇచ్చినట్లు తెలిసింది. అయితే వారిద్దరు మాత్రం బి‌జే‌పిలో చేరుతున్నట్లు ప్రకటించలేదు. అన్నీ ఆలోచించుకుని పార్టీలో చేరే విషయం చెబుతానని అన్నారు. ఇప్పుడు పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

అంటే ఇంకా బి‌జే‌పిలో చేరే విషయంలో క్లారిటీ లేదు. అదే సమయంలో వీరితో కాంగ్రెస్ నేతలు కూడా టచ్ లోనే ఉన్నారు. కానీ ఈ ఇద్దరు నేతలు ఆచి తూచి అడుగులేస్తున్నారు. సమయాన్ని బట్టి పార్టీ మారే విషయంలో తేల్చనున్నారు. అయితే కర్నాటక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఫలితం బట్టి ఈ ఇద్దరు నేతల నిర్ణయం ఉండవచ్చు. కర్నాటకలో బి‌జే‌పి గెలిస్తే ఆ పార్టీ వైపుకు వెళ్లవచ్చు..లేదా కర్నాటకలో కాంగ్రెస్ గెలిస్తే దాని బట్టి ఆలోచించుకుని..నిర్ణయం తీసుకోవచ్చు. చూడాలి మరి ఈ ఇద్దరు నేతలు ఏ పార్టీలోకి వెళ్తారో.

Share post:

Latest