Review: ఉగ్రం సినిమాతో అల్లరి నరేష్ మాస్ హీరో అయినట్టేనా..?

అల్లరి నరేష్ నటనపరంగా కామెడీ పరంగా ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. నరేష్ గతంలో నటించిన నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి సినిమాలతో విభిన్నమైన నటనతో ఆకట్టుకున్నారు అల్లరి నరేష్ అయితే తాజాగా ఉగ్రం సినిమాల్లో నటించారు. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డైరెక్టర్ విజయ్ కనకమెడల దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూడాలి మరి.

Ugram Release Date, Star Cast, Trailer, Plot & More Details Here -  JanBharat Times
సినిమా చూసిన నేటిజెన్ల కామెంట్లను బట్టి చూస్తే ఉగ్రం సినిమాకు పాజిటివ్ టాక్ నెలకొనిందని చెప్పవచ్చు. నరేష్ ఈ సినిమాలో సరికొత్త పోలీస్ పాత్రలో ఆకట్టుకున్నారట. త్రిల్లింగ్ కాన్సెప్ట్ తో మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా అల్లరి నరేష్ కు బాగానే కలిసి వచ్చిందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈసారి ఉగ్రం టైటిల్ కు తగ్గట్టుగా పోలీస్ ఆఫీసర్గా తన ఉగ్రరూపాన్ని చూపించారని కామెంట్లు చేస్తున్నారు.

https://twitter.com/PKasindala/status/1654248022568476672?s=20

ఈ సినిమా మిస్సింగ్ కేసుల నేపథ్యంలో తెరకెక్కించారు. నగరంలో ఏదో గ్యాంగ్ ప్రజలను మిస్ అవుతూ ఉంటారు ఇందులో అల్లరి నరేష్ కుటుంబం కూడా మిస్సింగ్ అవుతుంది.ఇందులో అల్లరి నరేష్ శివకుమార్ అనే పోలీస్ ఇన్స్పెక్టర్గా కనిపించారు మిస్సింగ్ కేసుల వెనుక ఉన్న మాఫియాను ఎలా చేదించారని కథ అంశంతో ఉగ్రం సినిమా తెరకెక్కించారు.

https://twitter.com/UnitedTwood2108/status/1654237062474911744?s=20

ఇప్పటికే ఈ సినిమా చూసిన వారంతా అల్లరి నరేష్ యాక్టింగ్ అదరగొట్టేసారని బిజిఎం కెమెరా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని అలాగే లవ్ సీన్స్ కొన్నిచోట్ల సాగదీయడం కాస్త మైనస్ గా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ సినిమా బాగుందని వార్తలైతే ఇప్పటికే వినిపిస్తున్నాయి.. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అభిమానులు తమ రివ్యూలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. మరి అల్లరి నరేష్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎంతటి కలెక్షన్లు రాబడతారో చూడాలి మరి.

https://twitter.com/SaiKrishnaPava3/status/1654246725781975040?s=20