ఆ సినిమాతో ఇండస్ట్రీ ని వదిలేయాలేయలనుకున్న.. అశ్వని దత్..!!

సీనియర్ నిర్మాత అశ్వని దత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే అప్పట్లో ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి పలు విజయాలను కూడా అందుకున్నారు. ఇప్పుడు తాజాగా ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ -k చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు గత ఏడాది సీతారామం చిత్రాన్ని కూడా ఈ బ్యానర్ పైన తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా అశ్వనీ దత్ కొన్ని ఇబ్బందుల గురించి తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

అశ్వని దత్ మాట్లాడుతూ తన కెరియర్లో ఒక సినిమా వల్ల కోలుకోలేని దెబ్బ తగిలిందని తెలిపారు 2011లో అశ్వని భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం శక్తి. అయితే ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్ కావడంతో అశ్విని దత్తుకు భారీ నష్టాలు మిగిలాయి. ఈ సినిమాని రూ .45 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారట అప్పట్లో అత్యంత ఖర్చుతో కూడిన భారీ ప్రాజెక్టు అన్నట్లుగా తెలియజేశారు. దీంతో దాదాపుగా శక్తి సినిమా వల్ల రూ.32 కోట్ల రూపాయలు నష్టం చూడవలసి వచ్చిందని దీంతో ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నానని తెలిపారు.

Sakthi (2011 film) - Wikipedia
శక్తి సినిమా తర్వాత దాదాపుగా నాలుగేళ్లపాటు సినిమాలు తీయాలనిపించలేదంటూ తెలిపారు. కానీ అశ్వని దత్ ప్రస్తుతం వైజయంతి మూవీస్ బ్యానర్ పై పలు చిత్రాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. అశ్వని దత్ దాదాపుగా రూ 500 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్న ప్రాజెక్టుకే సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు చిత్ర బృందం. ప్రస్తుతం అశ్విని దత్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest