`రామ‌బాణం` ట్విట్ట‌ర్ టాక్‌.. గోపీచంద్-శ్రీవాస్ హ్యాట్రిక్ మూవీ ఎలా ఉందంటే?

లౌక్యం, సౌక్యం వంటి సూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత‌ టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్ లో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ `రామబాణం`. ఇందులో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తే.. జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రల‌ను పోషించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు అట్టహాసంగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకుల ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. లక్ష్యం సినిమాలో అన్నదమ్ముల్లుగా నటించిన గోపీచంద్, జగపతి బాబు మరోసారి ఈ సినిమాలో బ్రదర్స్ క్యారెక్టర్స్ ను పోషించారు. సినిమా బాగుంది బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. మ‌రికొంద‌రు రొటీక్ క‌థ అంటూ పెద‌వి విరిస్తున్నారు.

అయితే ఇంట్రవెల్ ట్వీస్ట్ మాత్రం బాగుంద‌ని, కామెడీ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఆక‌ట్టుకున్నాయ‌ని చెబుతున్నారు. ఫ‌స్ట్ హాప్ బాగున్నా.. సెకెండ్ ఆఫ్ ఆశించిన రేంజ్ లో లేద‌ని కొంద‌రు అంటున్నారు. గోపీచింద్ ఎప్ప‌టిలాగానే తెర‌పై మ్యాజిక్ చేశాడని.. డింపుల్ యూట్యూబర్ గా తన అందం, నటనతో అలరించిందని పలువురు చెబుతున్నారు. మొత్తంగా రామ‌బాణంకు ఇటు పాజిటివ్ తో పాటు అటు నెగ‌టివ్ టాక్ కూడా వ‌స్తోంది. బ్లాక్ బ‌స్ట‌ర్ కాక‌పోయినా ఈ సినిమా హిట్ అవుతుంద‌ని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.

Share post:

Latest