ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు జనంలోకి ఎక్కువగా వెళుతున్న విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా బాబు జనంలోనే ఉంటున్నారు. దీంతో బాబుకు ప్రజా మద్ధతు కూడా బాగానే వస్తుంది. అయితే సిఎం జగన్ మాత్రం పెద్దగా జనంలోకి వెళ్ళడం లేదు. ఏదైనా పథకాలు, శంఖుస్థానపనలు పేరుతో..జనాలని సమీకరించి భారీ సభలు పెడుతున్నారు. అక్కడ స్పీచ్ జగన్ వెళ్లిపోతున్నారు. దీంతో జనంకు ఉన్న సమస్యలు ఆయనకు చేరడం లేదు.
కానీ బాబు జనంలోకి వెళ్ళి జనం సమస్యలు వింటున్నారు..దీంతో బాబుకు కాస్త జనంలో పాజిటివ్ కనిపిస్తుంది. ఆయన జనంలో తిరగడం ఒక ఎత్తు అయితే..వైసీపీ ఓ రేంజ్ లో బాబుని టార్గెట్ చేసి చేస్తున్న రాజకీయం మరో ఎత్తు అవుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదొక విధంగా బాబుని వైసీపీ ఇబ్బంది పెడుతూనే ఉంది. టిడిపిని తొక్కడానికి అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కేసులు, జైలుకు పంపడం..ఇలా టిడిపి నేతలకు చుక్కలు చూపిస్తుంది. ఇక బాబుని కొందరు నేతలు బూతులు తిడుతున్నారు. అలా తిట్టడం వల్ల బాబుకు పోయేదేమీ లేదు గాని..వైసీపీకే రివర్స్ అయ్యేలా ఉంది.
ఇక తాజాగా అమరావతి భూ స్కామ్ జరిగిందని సిట్ విచారణ చేసి..బాబుని జైల్లో పెడతామని, ఆయన అరెస్ట్ ఖాయమని వైసీపీ నేతలు అంటున్నారు. అదే జరిగితే బాబుకే మేలు తప్ప వైసీపీకి ఒరిగేది ఏమి లేదు. అందుకే బాబుకు తెగించేశారు..ఏం చేసుకుంటారో చేసుకోండీ అంటూ ఫైర్ అవుతున్నారు.
అలా వైసీపీ నేతల స్టేట్‌మెంట్లని బాబు అప్పుడే జనంలోకి తీసుకెళ్లిపోతున్నారు. పైగా వర్షాల వల్ల నష్టపోయిన రైతులని పరమర్శిస్తూనే..వైసీపీ విధానాలపై ఫైర్ అవుతున్నారు. అంటే పరోక్షంగా వైసీపీనే బాబుని పైకి లేపుతుందని చెప్పవచ్చు.