ప్లాస్టిక్ సర్జరీలతో మరింత అందంగా మారిన హీరోయిన్లు.. ఎన్ని కోట్లు ఖర్చు చేశారంటే

సినిమాల్లో కనిపించే హీరోయిన్లు చాలా అందంగా ఉంటారు. మేకప్‌తో స్క్రీన్‌పై తళుకులీనుతారు. అది చూసిన ప్రేక్షకులు కేరింతలు కొడతారు. కొందరు హీరోయిన్లకు అయితే అభిమానులు ఏకంగా గుడి కట్టి పూజలు చేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో హీరోయిన్లు అందంపై ఎప్పటికప్పుడు శ్రద్ధ వహిస్తారు. ఇటీవల కాలంలో హీరోయిన్లు తమ అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. వీటి కోసం ఏకంగా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. మారిన ముఖంతో వావ్ అనిపిస్తున్నారు. ఇలా ప్లాస్టిక్ సర్జరీలతో ముఖాన్ని మరింత అందంగా మార్చుకున్న హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.

తెలుగులో హీరోయిన్ శ్రీదేవి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చాలా చిన్న వయసులోనే ఆమె హీరోయిన్‌గా రంగప్రవేశం చేసింది. అందంగా ఉన్నప్పటికీ ఆమె ముక్కు అంత ఆకర్షణీయంగా ఉండేది కాదు. దీంతో రూ.2 కోట్లు వెచ్చించి ప్లాస్టిక్ సర్జరీతో ఆమె తన ముక్కును మార్చుకుంది. ప్రస్తుతం సౌత్‌లో ఎక్కువ మంది మెచ్చిన హీరోయిన్ సమంత. హీరోయిన్‌గానే కాకుండా పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా మరింత పేరు సంపాదించుకుంది. ఆమె రూ.1 కోటి వెచ్చించి తన పెదవులకు సర్జరీ చేయించుకుంది.


ఇక శ్రీదేవి తర్వాత ఆ స్థాయిలో ఏ మాత్రం తరగని అందంతో ఉన్న నటి శ్రియ. ఆమె కూడా తన పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేందుకు రూ.3 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఏళ్లు గడుస్తున్నా హీరోయిన్‌గా ఇప్పటికీ కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్న నటి త్రిష. ఇటీవల విడుదలైన పొన్నియిన్ సెల్వన్-1లో ఆమె చాలా అందంగా కనిపించింది. త్రిష కూడా అందమైన ముక్కు కోసం రూ.3 కోట్లతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం. అగ్రహీరో కమల్ హాసన్ గారాలపట్టి శ్రుతిహాసన్ అందచందాలతో ప్రేక్షకులను మైమరపింపజేస్తోంది. కుర్ర హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరి సరసనా ఆమె నటిస్తోంది. ఈమె కూడా తన ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అందుకు రూ.3 కోట్ల వరకు ఖర్చు పెట్టిందని సమాచారం. ఏజ్ పెరిగుతున్నా, పెళ్లి అయినా లేడీ సూపర్‌స్టార్‌గా సౌత్‌లో నయనతార వెలుగొందుతోంది. వయసు రీత్యా శరీరంలో బరువు పెరుగుతుండడంతో ఆమె దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించింది. సన్నబడేందుకు లైపో, ఇతర ప్లాస్టిక్ సర్జరీల కోసం ఆమె రూ.4 కోట్లు ఖర్చు చేసింది.