ఈ సీనియర్ హీరోల్లో నంబర్ వన్ ఎవరో తెలిసిపోయింది..

మన తెలుగు హీరోలకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. భారత దేశ చిత్ర పరిశ్రమలో మన తెలుగు సినిమాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ ద్వారా ఎంతో మంది హీరోలు ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను గెలుచుకుని తెలుగు సినిమాలను టాప్ రేంజ్ లో నిలబెట్టారు. సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చే సమయానికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున లాంటి హీరోల హవా నడిచింది.

వారిలో మొదటిగా చిరంజీవి గురించి మాట్లాడుకుంటే స్వయం కృషితో ఎదిగిన చిరంజీవి అభిమానుల నోట మెగాస్టార్‌గా పిలిపించుకోబడ్డాడు. ప్రాణం ఖరీదు అనే సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికి 40 ఏళ్లు దాటింది. ఇప్పటికీ అతని క్రేజ్ ఏం తగ్గలేదు. పసివాడి ప్రాణం, గ్యాంగ్ లీడర్, యముడికి మొగుడు లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఉపేశాడు. సినిమాల్లో చిరు డాన్స్ స్టెప్పులు, ఫైటింగ్ సీన్స్ చూసి జనాలు ఫిదా అయ్యారు. ఇక తెలుగులో కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి నటుడు చిరంజీవి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన చిరు రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత దాదాపు 9 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తరువాత ఖైదీ నెంబర్ 150 సినిమా తో రీ-ఎంట్రీ ఇచ్చి బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిసి గా ఉన్నాడు.

ఇక నందమూరి బాలకృష్ణ ‘మంగమ్మ గారి మనవడు’ సినిమాతో సక్సెస్‌ఫుల్ హీరోగా నిలిచాడు. పట్టాభిషేకం, దేశోద్ధారకుడు లాంటి కొన్ని సినిమాలతో వరుస విజయాలను అందుకొని ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎవరికి లేనన్ని సూపర్ హిట్ సినిమా లు బాలయ్య కెరీర్‌లో ఉన్నాయి. మువ్వా గోపాలుడు, రాముడు భీముడు, బాల గోపాలుడు లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను బాలయ్య తన కథలో వేసుకున్నారు. అప్పట్లో చిరు, బాలయ్య నడుమ గట్టి పోటీనే నడిచింది.

ఆ తరువాత ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విక్టరీ వెంకటేష్ కథను ఎంచుకునే సమయంలో ఆచి తూచి అడుగులేశాడు. బ్రహ్మరుద్రుడు, అజేయుడు, శ్రీనివాస కళ్యాణం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా లో నటించాడు. బొబ్బిలి రాజ, శత్రువు, కూలి నెంబర్ వన్, చంటి లాంటి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. ఇక అక్కినేని నాగార్జున విక్రమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన మొదటి చిత్రం తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. మజ్ను, కలెక్టర్ గారి అబ్బాయి, గీతాంజలి లాంటి చిత్రాలు నాగ్ ని ఒక రేంజ్ కి తీసుకెళ్లాయి. ఆ తర్వాత అతను చేసిన హలో బ్రదర్ కూడా బాగా పేరు తెచ్చి పెట్టింది. అయితే ఈ నలుగురు హీరోలలో ఎవరి నెంబర్ వన్ స్థానంలో ఉన్నారో చెప్పడం కష్టమే కానీ కొన్ని ఓట్ల తేడాతో చిరంజీవి ముందు స్థానంలో నిలిచాడు.