ఇయర్ స్టార్టింగ్ లోనే మొదలు పెట్టేసిన అనసూయ..వాళ్ల నోర్లకి జిప్ వేసిన్నట్లేగా..!!

ఎట్టకేలకు 2022వ సంవత్సరానికి సక్సెస్ ఫుల్ గా గుడ్ బై చెప్పేసాం. పాత జ్ఞాపకాలను చెరిపేస్తూ కొత్త ఆశలతో ..సరి కొత్త ఊహలతో న్యూ ఇయర్ ని స్టార్ట్ చేశాం. ఈ క్రమంలోనే సినిమా సెలబ్రిటీస్ కొత్త కొత్త ఆఫర్స్ అందుకుంటూ న్యూ ఇయర్ ని క్రేజీగా మొదలుపెట్టారు . ఈ క్రమంలోనే తన కొత్త ఆఫర్ గురించి అభిమానులతో పంచుకున్నింది స్టార్ యాంకర్ అనసూయ .

అనసూయ..ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . న్యూస్ రీడర్గా తన కెరియర్ స్టార్ట్ చేసిన అనసూయ ..ఆ తర్వాత మెల్లమెల్లగా ఇండస్ట్రీలోకి రావాలన్న తనకలను నెరవేర్చుకుంటూ అటువైపుగా అడుగులు వేసింది. ప్రజెంట్ యాంకర్ ఫీల్డ్ కి గుడ్ బాయ్ చెప్పేసి సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తున్న అనసూయ .. రీసెంట్గా అభిమానులతో సెల్ఫీ ని షేర్ చేసుకుంది . “న్యూ ఇయర్లో ..న్యూ సెల్ఫీ ..న్యూ ఫ్లైట్.. న్యూ అసైన్మెంట్ ” అంటూ క్యాప్షన్ ఇస్తూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులను ప్రారంభించింది .

ఈ క్రమంలోనే జబర్దస్త్ మానేసిన తర్వాత అనసూయకు ఆఫర్లు లేవు ..ఇకపై రావు.. పుష్ప సినిమా నుంచి ఆమెను తీసేశారు ..అన్న వాళ్లకు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన్నట్లైంది. అంతేకాదు అలాంటి వాళ్ళ నోళ్ళకి జిప్ వేసినట్లుగా తన పోస్ట్ తో ఆన్సర్ ఇచ్చింది అనసూయ . ఏది ఏమైనా సరే అనసూయ తన కెరీర్ ని కొత్తగా ప్రారంభించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.