ఎర్రబెల్లి లెక్కలు..20 ఎమ్మెల్యేలని మార్చాలా?

తెలంగాణలో మూడో సారి అధికారంలోకి రావాలని కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. అలాగే తెలంగాణలో మళ్ళీ అధికారమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అయితే గతంలో మాదిరిగా ఈ సారి తెలంగాణలో అధికారం దక్కించుకోవడం కారు పార్టీకి అంత ఈజీనా అంటే? చెప్పడం కష్టమే.

తెలంగాణలో గులాబీ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది..అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పికప్ అయితే సీన్ మారిపోతుంది. ఇలాంటి పరిస్తితుల్లో గులాబీ పార్టీకి గెలుపు ఈజీ కాదు. కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్లు చీలిపోయి తమకు ప్లస్ అవుతుందని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఇక ఇప్పుడున్న పరిస్తితుల్లో ప్రస్తుతం గులాబీ పార్టీకే ఆధిక్యం ఉందని తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు గెలుస్తామని ఆల్రెడీ కాన్ఫిడెన్స్‌గా కేసీఆర్ ప్రకటించారు. తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ 80 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని, ఓ 20 మంది ఎమ్మెల్యేల సీట్లు మారితే 100 సీట్లు గెలవడం ఖాయమని అంటున్నారు.

ఓ 6-7 జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీతో పోటీ ఉంటుందని, 3-4 నాలుగు జిల్లాల్లో బీజేపీతో పోటీ ఉంటుందని అంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 20-25 సీట్లు వస్తాయని, బీజేపీకి 15-20 స్థానాలు వస్తాయని, తమకు 80 సీట్లు వస్తాయని ఎర్రబెల్లి అంచనా వేస్తున్నారు. అయితే ఎర్రబెల్లి చెప్పినట్లు కేసీఆర్..20 మంది సిట్టింగా ఎమ్మెల్యేలని మారుస్తారా? లేదా? అనేది చూడాలి. ఇక ఎర్రబెల్లి చెప్పినట్లు బీఆర్ఎస్‌కు 80 సీట్లు వస్తాయో లేదో చూడాలి.