వ్యభిచారి గృహం నడుపుతూ చిక్కిన హీరో..?

కన్నడ ఇండస్ట్రీలో నటుడు మంజునాథ్ అలియాస్ సంజు తాజాగా వ్యభిచారం చేస్తూ పట్టుబడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా పలు సినిమాలలో విలన్ గా నటిస్తు బాగానే పేరు సంపాదించారు. మూడు సంవత్సరాల క్రితం విడుదలైన న్యూరాన్ అనే ఒక సైకాలజీ థ్రిల్లర్ మూవీలో మంజునాథ్ హీరోగా నటించారు. ప్రస్తుతం ఈ నటుడుకి అనేక బిజినెస్ లు కర్ణాటక ప్రాంతాలలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రీసెంట్గా సిబిఐ అధికారులకు ఇన్ఫర్మేషన్ రావడంతో రిక్కీ నిర్వహించినట్లు సమాచారం.

వ్యభిచారం కేసులో సినీ నటుడు మంజునాథ్ అరెస్ట్..

కన్నడ మీడియా లో వార్తలు వినిపిస్తున్న ప్రకారం బంగ్లాదేశ్ నుంచి బెంగళూరుకు అక్రమంగా అమ్మాయిలను తీసుకువచ్చి వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బెంగళూరు నగరంలోని కింగేరి డెంటల్ కాలేజీ సమీపంలో ఒక అద్దె ఇంట్లో ఈ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుసుకున్న అధికారులు అక్కడ రెక్కి నిర్వహించారు. నిన్న తెల్లవారుజామున 4 నుంచి 5:30 గంటల మధ్య సిబిఐ పోలీసులు దాడులు నిర్వహించగా.. బాదరహళ్లి ప్రాంతాలలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందట.

ఈ దాడిలో మొత్తం ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు నిందితులను విచారించగా మంజునాథ్ పేరు తెలియజేసినట్లు తెలుస్తోంది. లోకాంటో అని యాప్ ద్వారా వీరు హైటెక్ వ్యభిచారానికి పాల్పడుతున్నట్లు సమాచారం.అమ్మాయిలకు పని ఇప్పిస్తానంటు చెప్పి బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి తీసుకు వచ్చి వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నట్లు వెల్లడించారట. ఇక ఈ దాడిలో నాలుగు మొబైల్స్ బంగ్లాదేశ్ కరెన్సీ భారతీయ నగదు లభించగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ నటుడు పైన నెటిజన్లు సైతం దుమ్మెత్తి పోస్తున్నారు.