బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పదంగా 2020 జూన్ 14వ తేదీన ముంబైలో తన అపార్ట్మెంట్ల మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. సుశాంత్ తన అపార్ట్మెంట్లోని గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోనట్లు పోలీసులు దృవీకరించారు. ఇక అప్పటినుంచి ఈ కేసు కొనసాగుతూనే ఉంది. ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే ఇదంతా ఇలా ఉండగా సుశాంత్ ఎంతో ప్రాణంగా పెంచుకున్న పెంపుడు సునకం ఫడ్జ్ తాజాగా మరణించింది. ఈ విషయాన్ని సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
ఫడ్జ్ నువ్వు స్వర్గంలో ఉన్న ఈ స్నేహితుడి దగ్గరకు వెళ్లిపోయావు.. మేము కూడా ఏదో ఒక రోజు మిమ్మల్ని అనుసరిస్తాము అప్పటివరకు మాకి బాధ తప్పదు గుండె ముక్కలు అయింది.. అంటూ బాగోదు వేయడానికి గురవుతూ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది ప్రియాంక సింగ్. అంతేకాకుండా సుశాంత్,ఫడ్జ్ కలిసి ఉన్న పలు ఫోటోలతో పాటు ఒక వీడియోను కూడా షేర్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తన యజమాని మృతి చెందిన తర్వాత పెంపుడు జంతువులు కూడా శాశ్వతంగా ఉండవు.. సుశాంత్ మరణించిన తర్వాత ఫడ్జ్ అతని కోసం చాలా ఎదురుచూసింది .ఈ నష్టం భరించలేనిది మీరు ధైర్యంగా ఉండండి మిమ్మల్ని ఓదార్చేందుకు మాకు మాటలు రావడం లేదు అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
అయితే సుశాంత్ సింగ్ ది మాత్రం హత్యనేని కుటుంబ సభ్యులతో పాటు ,అభిమానులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. వారి ఆరోపణలు నిజం చేస్తూ సుశాంత్ సింగ్ ని పోస్టుమార్ట్ చేసిన సిబ్బందిలో ఒక వ్యక్తి గడిచిన కొద్ది రోజుల క్రితం పెను సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ బాడిని చూసిన వెంటనే ఇది ఆత్మహత్య కాదని .. హత్యానేని తెలియజేశారు.. ఇక తన సోదరుడి మృతి ఉద్దేశపూర్వంగానే చేస్తున్నారని ఈ కారణంగానే ఈ కేసులో చార్జిషీట్ ని దాఖలు చేయడానికి ఆలస్యం చేస్తున్నారంటూ ఇమే సోషల్ మీడియా వేదికగా ప్రియాంకసింగ్ పలు ఆరోపణలు చేస్తోంది.
So long Fudge! You joined your friend’s Heavenly territory… will follow soon! Till then… so heart broken 💔 pic.twitter.com/gtwqLoELYV
— Priyanka Singh (@withoutthemind) January 16, 2023