ఈ సంక్రాంతికి అస‌లైన బాక్సాఫీస్ విన్న‌ర్ ఎవ‌రు..?

సంక్రాంతి పండుగ వచ్చిందంటే థియేటర్ల వద్ద కొత్త సినిమాల హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అందుకే సంక్రాంతి పండ‌గను సినిమాల‌ పండగ అని కూడా పిలుస్తుంటారు. ఇక ఈ సంక్రాంతికి తెలుగులో మొత్తం ఐదు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. అందులో మొదట అజిత్ కుమార్ నటించిన `తెగింపు(తమిళంలో తునివు)` సినిమా విడుదల అయింది. ఈ చిత్రం తమిళంలో హిట్ అయిన తెలుగులో డివైడ్ టాక్ ను మూట‌గ‌ట్టుకుంది.

ఆ తర్వాత రోజు అంటే జనవరి 12న నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెర‌కెక్కిన `వీర సింహారెడ్డి` విడుదల అయింది. జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య` ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ రెండు చిత్రాలకు మిక్స్డ్ టాక్‌ లభించింది. జనవరి 14న విజయ్ ద‌ళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ `వారసుడు` తో పాటు యంగ్ హీరో సంతోష్ శోభ‌న్‌ నటించిన `కళ్యాణం కమనీయం` విడుదల అయింది.

వారసుడు తమిళంలో పర్వాలేదనిపించుకున్నా తెలుగులో మాత్రం ప్రేక్షకులను వేపించలేకపోయింది. ఇక కళ్యాణం కమనీయం విష‌యానికి వస్తే తొలి రోజే ఈ మూవీకి డిజాస్టర్ టాక్ లభించింది. అసలైన బాక్సాఫీస్ విన్నర్ ఎవరు అన్నది పక్కన పెడితే ఈ సంక్రాంతి కాస్త చెప్పగానే సాగింది. బ్లాక్ బస్టర్ హిట్ అన్న మాట అటుంచు.. క‌నీసం హిట్ అనే టాక్ ఏ ఒక్క‌ సినిమాకు రాలేదు. అయితే వీరసింహారెడ్డి, వాల్తేరు వీర సినిమాలు మాత్రం టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లను రాబ‌డుతున్నాయి. ఈ రెండు చిత్రాలు సంక్రాంతికి సేఫ్ అయ్యేలా కనిపిస్తున్నాయి.