టాలీవుడ్ లో ఎంతమంది డాక్టర్లు ఉన్నారో తెలుసా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ప్రతి ఒక్కరికి తమ అభిమాన నటుల గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంటారు. అలా డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయిన నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ చదివి కూడా యాక్టర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మన టాలీవుడ్ సీనియర్ నటులలో హాస్యనటుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్యంతో కూడిన విలన్ గా రాణించిన డాక్టర్ అల్లు రామలింగయ్య కూడా డాటర్.. ఈయన హోమియోపతి వైద్యం చేసేవారు.

Allu Arjun Inaugurated 'Allu Studios' As A Tribute To His Grandfather, Allu  Ramalingaiah's Legacy

ఈయన పేరు మీద రాజమండ్రిలో డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి కాలేజీ కూడా ఉంది. డాక్టర్ రాజశేఖర్ ఎంబి బిఎస్ పూర్తిచేసి, కొంతకాలం హౌస్ సర్జన్ గా చేసాడు. సినిమాల్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఎన్నో సినిమాల‌తో దూసుకెళ్లి ఆతర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కు మెచ్చే సినిమాల‌తో రాణించాడు.

Covid Positive Telugu Actor Rajasekhar Not Critical But Fighting Hard,  Informs Daughter

ఈ త‌రం జనరేషన్ లో కూడా ఎన్నో సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ ముద్దుగుమ్మ ఫిదా హీరోయిన్ సాయిపల్లవి కూడా ఎం బి బి ఎస్ పూర్తిచేసింది. ఈమె సాయిపల్లవి కార్డియాలజిస్ట్ చేసింది. ఢీషోలతో అదరగొడుతూ ఎంబి బిఎస్ పూర్తిచేసిన ఈ ముద్దుగుమ్మ‌ సినిమాల్లో బిజీగా ఉంది. కోలీవుడ్ హీరో జీవా న‌టాంచిన‌ రంగం సినిమాతో పరిచయమైన అజ్మర్ కూడా ఉక్రెయిన్ లో మెడిసిన్ పూర్తిచేసాడు.

Sai Pallavi is doctor now | nowrunning

టాలీవుడ్ లో కూడా ఎన్నో సపోర్టింగ్ పాత్రల్లో నటించిన భరత్ రెడ్డి కూడా ఆమెరికాలో కార్డియాలజీలో డిప్లొమా పూర్తి చేసాడు. ప్ర‌స్తుతం అపోలో హాస్పిటల్ లో సేవలు అందిస్తున్నాడు. అంతేకాదు, నటుడు ప్రభాకర్ రెడ్డి కూడా డాక్టర్. సినిమాల్లో డాక్టర్ పాత్రలు ఎక్కువ వేస్తుంటాడు. అలాగే ఉమామహేశ్వర ఉగ్ర రూప సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక గా యాక్ట్ చేసిన తెలుగమ్మాయి రూప కూడా డాక్టర్ చదివింది.

ఈమె గుంటూరు మెడికల్ కాలేజీలో చదివి ఎంబి బిఎస్ కూడా పూర్తి చేసింది.ప్రముఖ మలయాళ నటి దివ్య నాయర్ కూడా ప్రఖ్యాత హోమియో డాక్టర్. తెలుగులో చంద్రహాస్ లాంటి సినిమాలు చేసిన హరనాథ్ పొలిచెర్ల కూడా డాక్టరే. లిటిల్ సోల్జర్స్ సినిమాలో అల్లరి నటనతో ఆకట్టుకున్న కావ్య ఇప్పుడు డాక్టర్ గా పనిచేస్తుంది.