కేంద్ర కేబినెట్‌లోకి తెలుగు రాష్ట్రాల నేతలు?

మరోసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణపై చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి వర్గంలోకి కీలక రాష్ట్రాలకు చెందిన వారిని తీసుకోవాలని మోదీ సర్కార్ ప్లాన్ చేస్తుంది. ఇదే క్రమంలో కేబినెట్ లోకి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రధాన మంత్రితో కలిపి 31 మంది కేబినెట్ మంత్రులు ఉన్నారు. ఇద్దరు స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు ఉన్నారు. ఇక 45 మంది సహాయ మంత్రులు..అంటే మొత్తం 78 మంది ఉన్నారు.

అయితే కేంద్ర కేబినెట్ లో 83 మంది వరకు ఉండే ఛాన్స్ ఉంది. దీంతో ఆ ఐదు పదవులని కూడా భర్తీ చేయాలని మోదీ సర్కార్ చూస్తుంది. త్వరలో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌ఘడ్, కర్ణాటక ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో గెలవడం బీజేపీకి చాలా కీలకం. మరి ఆ రాష్ట్రాలకు సంబంధించి ఎవరినైనా కేంద్ర కేబినెట్ లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక తెలంగాణ కూడా బీజేపీకి కీలకం. వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలని చెప్పి పట్టుదలతో ఉంది.

అయితే ఇప్పటికే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇక ఇక్కడ నుంచి మరొకరిని కేబినెట్ లోకి తీసుకుంటారని తెలుస్తోంది. తెలంగాణలో బండి సంజయ్, అరవింద్, సొయం బాపురావు, కే.లక్ష్మణ్ ఎంపీలుగా ఉన్నారు. వీరిలో ఎవరిని కేబినెట్‌లోకి తీసుకుంటారో చూడాలి. ఇటు ఏపీ నుంచి సీఎం రమేష్, జి‌వి‌ఎల్ ఉన్నారు. జి‌వి‌ఎల్ ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు.

ఎక్కువ శాతం తెలంగాణ నుంచే మరొకరికి కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అక్కడ కేసీఆర్‌కు చెక్ పెట్టాలంటే మరొకరిని కేంద్ర మంత్రిగా చేయాలని కోణంలో బీజేపీ అధిష్టానం ఉంది. చూడాలి మరి ఎవరిని కేబినెట్ లోకి తీసుకుంటారో.