`వీర‌ సింహారెడ్డి` కథ మొత్తం లీక్‌.. బాల‌య్య‌కు మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాయ‌మేనా?

గత ఏడాది `ఆఖండ` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హ‌నీ రోజ్‌ తదితరులు ఇందులో కీల‌క‌ పాత్రల‌ను పోషిస్తున్నారు.

ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమాపై మంచి హైప్‌ క్రియేట్ చేస్తున్నారు. త్వరలోనే ప్రచార కార్యక్రమంల‌ను సైతం ప్రారంభించబోతున్నారు. అయితే ఇలాంటి తరుణంలో వీర సింహారెడ్డి కథ మొత్తం లీక్ అంటూ నెట్టింట ఓ న్యూస్‌ వైరల్ అవుతుంది. ఈ మూవీలో బాలయ్య ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. ఒకటి విలేజ్ బ్యాక్‌డ్రాప్ క్యారెక్టర్ అయిన వీరసింహారెడ్డి , మరొకటి యుఎస్-రిటర్న్ రోల్ అయిన బాల సింహారెడ్డి.

ఈ తండ్రి, కొడుకులు చుట్టూ కథ తిరుగుతుంద‌ట‌. ఈ రెండు పాత్రల మధ్య మంచి వేరియేషన్ ఉంటుందట‌. అయితే గ్రామ రాజకీయాల్లో వీరసింహారెడ్డి పాత్ర చనిపోతే.. యుఎస్ నుంచి వచ్చిన బాల సింహారెడ్డి శత్రువుల‌పై పగ తీర్చుకుంటాడని, అలాగే త‌న తండ్రి మధ్యలో ఆపేసిన కొన్ని పనులను పూర్తి చేస్తాడని చెప్తున్నారు. సాప్ట్ వేర్ నుంచి వచ్చిన వాడు ఫ్యాక్షన్ రాజకీయాల్లోకి వస్తే లైట్ తీసుకున్న వాళ్లకు ఎలా బుద్ది చెప్పాడు అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్ అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, ఈ సినిమాతో బాల‌య్య‌కు మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాయ‌మంటూ టాక్ న‌డుస్తోంది.