బిచ్చగాడు హీరో వైఫ్ ఫాతిమా బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే బిత్తర పోవాల్సిందే..!

తెలుగు ప్రేక్షకులకు సినిమాలో ఉన్న కంటెంట్ నచ్చితే ఆ సినిమాలో నటించే హీరోను స్టార్ హీరోనా మామూలు హీరోనా అని చూడరు. సినిమా నచ్చితే ఆ హీరోని వాళ్ళు నెత్తిన పెట్టుకుంటారు. ఈ కాన్సెప్ట్ తోనే తమిళ హీరోలు తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. అలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఒక తమిళ హీరో విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

First Look Of Vijay Antony's highly anticipated sequel to be out on his birthday

విజయ్ హీరో గానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గా, దర్శకుడుగా, ప్రొడ్యూసర్ గా కూడా కోలీవుడ్ లో సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈ కోలీవుడ్ హీరో గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం. విజయ్ ఆంటోని తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు.. తన చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయాడని ఆ టైంలో తనకి ఏడు సంవత్సరాలు.. తన చెల్లికి నాలుగు సంవత్సరాలు మాత్రమే.. దీంతో వారి తల్లి ఉద్యోగం చేస్తూ వారిని చదివించింది.

Be Careful With Strangers. They May Finish Off The Story' - Vijay Antony's Sudden Emotional Advice Gone Viral - Filmibeat

విజయ్ అంటోని చదువులో కూడా ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచేవాడు. అయితే తన తల్లి ఉద్యోగరీత్యా వేరే ప్లేస్ కి వెళ్లడంతో ఆ టైంలో విజయ్ హాస్టల్‌లో ఉండి చదువుకున్నాడు. ఆ టైంలో అతను చాలా దారుణమైన పరిస్థితి అనుభవించారట. అంత దారుణమైన పరిస్థితిలో కూడా తన చదువును కంప్లీట్ చేసుకున్నాడు.
చదువు పూర్తయిన తర్వాత సినిమాల్లో తన కెరియర్ మొదలు పెట్టాలనుకున్నాడు. ఆ సమయంలో తన వెన‌క ఉండి నడిపించింది తన భార్య.. అలాగే త‌న‌ విజయాల‌కు కూడా తన భార్యనే కారణమట రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ చెప్పాడు.

Fathima Vijay Antony Biography, Wiki, Age, Personal Details - wikimylinks

అయితే విజయ్ ఆంటోని భార్య పేరు ఫాతిమా.. ఆమె ఒక జర్నలిస్ట్.. వీరిద్దరిది లవ్ మ్యారేజ్.. ఒకరోజు విజయ్‌ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఫాతిమాని విజయ్ చూసి ప్రేమలో పడ్డాడు.. తరవాత 2006 లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి లారా అనే కూతురు కూడా ఉంది. ఇక పెళ్లి తర్వాత విజయ్‌కు సినిమా పరిశ్రమలో వరుస అవకాశాలు వచ్చాయి. 2012లో వచ్చిన నాన్ అనే తమిళ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

అలాగే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నో సినిమాలుకు సంగీతం అందించాడు. అలాగే విజయ్ ఎడిటర్ గా, ప్రొడ్యూసర్ గా కూడా కోలీవుడ్ లో ఎన్నో సినిమాలను తెరకెక్కించాడు. అయితే విజయ్ ఆంటోనీ ఇన్ని విజయాలు అందుకోవడానికి ప్రధాన కారణం ఆయన భార్యన‌ట. ప్రస్తుతం విజయ్ ఆంటోని హత్య అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.