తన కుమారుడు ఎంట్రీ పై.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రవితేజ..!!

ఏ సినీ ఇండస్ట్రీలోనైనా సరే నటుల దర్శకుల, డైరెక్టర్ల, వారసులు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే అటు మెగా కుటుంబం నుంచి అక్కినేని కుటుంబం , నందమూరి కుటుంబం , దగ్గుబాటి కుటుంబం నుంచి ఎంతోమంది ఇండస్ట్రీ లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తాజాగా మాస్ హీరో రవితేజ తన కుమారుడి ని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Ravi Teja's son Mahadhan signs his Secondరవితేజ కుమారుడు మహాధన్ త్వరలోనే ఇండస్ట్రీకి ఇడియట్-2 చిత్రం ద్వారా పరిచయం కాబోతున్నారని వార్తలు చాలా వైరల్ గా మారడం జరిగింది. దీంతో నిన్నటి రోజున వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న రవితేజ ఈ వార్తలు పైన స్పందించడం జరిగింది. ఇక తన కుమారుడు ఎంట్రీపై పలు షాకింగ్ విషయాలు కూడా తెలియజేశాడు. తన కుమారుడి గురించి వచ్చిన విషయం కేవలం వట్టి పుకార్లే అంటూ తెలియజేశారు. అలాగే రవితేజ మైత్రి మూవీస్ మేకర్స్ వారిలో రవిశంకర్ మహాధన్ ఇంకా చిన్న పిల్లవాడే కదా అని తెలియజేశారని రవితేజ తెలియజేయడం జరుగుతుంది.

Ravi Teja Family Memebrs, Wife, Daughter, Son, Father, Mother, Brothers &  Biography - YouTubeగతంలో మహధన్ రవితేజ నటించిన రాజా ది గ్రేట్ సినిమాలో చైల్డ్ యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో తన నటనతో ప్రశంసలు అందుకున్న రవితేజ కొడుకు ఇక అప్పటినుంచి ఇడియట్-2 సినిమాతో ఎంట్రీ ఇస్తారని వార్తలు వైరల్ గా మారాయి. దీంతో రవితేజ నిన్నటి రోజున క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. మరి ఏ సినిమాతో రవితేజ కొడుకు ఎంట్రీ ఇస్తారో చూడాలి మరి. ప్రస్తుతం రవితేజ సినీ కెరియర్ విషయానికి వస్తే.. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వంటి చిత్రాలలో నటిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన ధమాకా చిత్రం బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది.