మంచు మోహన్ బాబు చిన్న కొడుకు గా శ్రీ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయ్యాడు మంచు మనోజ్. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. మంచు కుటుంబంలోనే అందరికంటే భిన్నమైన వ్యక్తిత్వంతో మనోజ్ అభిమానుల్లో పేరు తెచ్చుకున్నాడు. అయితే గత కొంత కాలంగా మనోజ్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఆయన సినిమా వచ్చి ఇప్పటికే కొన్ని సంవత్సరాలు అవుతుంది.
అయితే ఈ మధ్య అహం బ్రహ్మాస్మి అనే ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ప్రకటించాడు మనోజ్. ఇక ఆ సినిమా గురించి ఇప్పటివరకు అప్డేట్ ఏమీ బయటకు ఇవ్వలేదు. రీసెంట్ గా సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించిన మనోజ్ ఆ సమయంలో ఓ అభిమాని ఈ సినిమా గురించి అడగగా ఆ సమయంలో స్మైల్ ఇమేజ్ ని షేర్ చేశాడు. ఆ మెసేజ్ బట్టి చూస్తే ఆ సినిమా పక్కకు వెళ్లిపోయినట్లుగా తెలుస్తుంది.
ఎన్నో అంచనాలు నడుమ మొదలుపెట్టిన ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయినట్లే అంటూ అందరూ భావిస్తున్నారు. ఈ సమయంలోనే మంచు మనోజ్ కొత్త సినిమా ఎప్పుడు అంటూ మళ్ళీ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. అయితే మనోజ్ తన భార్య ప్రణతి రెడ్డి నుంచి విడాకులు తీసుకున్నప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అసలు ఆయన సినిమా ఎప్పుడు చేస్తారనేది కూడా ఎవరికీ క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ ప్రస్తుతం మాజీ మంత్రి భూమ అఖిలప్రియ సోదరి భూమా మౌనిక రెడ్డి తో ప్రేమలో ఉన్నాడు.
ఆమెను రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్టు కూడా తెలుస్తుంది. వీరిద్దరూ వచ్చే కొత్త సంవత్సరం ఫిబ్రవరిలో ఒక్కటి కాబోతున్నారని కూడా తెలుస్తుంది. ఇక అదే జరిగితే పెళ్లి తర్వాతే మనోజ్ కొత్త సినిమా అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. టాలీవుడ్ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మనోజ్- మౌనిక రెడ్డి పెళ్లి తర్వాతే తన సినీ కెరియర్ గురించి ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడని తెలుస్తుంది.