టాలీవుడ్ లో యంగ్ హీరో అడవి శేషు ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. గూడచారి ,ఎవరు, మేజర్ వంటి హ్యాట్రిక్ విజయాలతో పాటు ప్రస్తుతం డబల్ హ్యాట్రిక్ విజయాలు అందుకోవడం కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే హిట్-2 సినిమా కూడా భారీ సక్సెస్ ని అందుకుంది. దీంతో తన తదుపరి రెండు చిత్రాలు కూడా మంచి విజయాలను అందుకోవాలని ప్లాన్ చేశారు అడవి శేషు. ఇక అందుకు తగ్గట్టుగానే తాజాగా గూడాచారి సినిమా సీక్వెల్ని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం.
మేజర్ తో పాన్ ఇండియా హీరోగా క్రేజ్ దక్కించుకున్న అడవి శేషు ఈ సినిమా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ఏకంగా మూడు నిర్మాణ సంస్థలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మేజర్ చిత్రానికి ఎడిటర్ గా పనిచేసిన వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాకి దర్శకుడుగా పరిచయం కాబోతున్నారు. అడవి శేషు ఈ సినిమాకి కథను అందించారు. సినిమాకి సంబంధించిన ఫ్రీ విజన్ వీడియోను జనవరి 9వ తేదీన ఢిల్లీ ముంబై నగరాలలో ఒకే చోట విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజున ప్రాజెక్టుకు సంబంధించి మరికొన్ని వివరాలు తెలిసి అవకాశమున్నట్లు తెలుస్తోంది.
అడవి శేషు మేజర్ సినిమాకు ఉత్తరాది రాష్ట్రాలలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ క్రేజీతోనే రాజధాని ఢిల్లీలో వాణిజ్య రాజధాని ముంబైలో గూడచారి సినిమాకి సంబంధించి స్పెషల్ ఈవెంట్ను కూడా ప్లాన్ చేయబోతున్నట్లు సమాచారం. నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నబాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా అడవి శేషు డబల్ హ్యాట్రిక్ కొడతాడో లేదో చూడాలి మరి.