లవర్‌తో చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్న మహేష్ హీరోయిన్.. అడ్డంగా బుక్ అయిందిగా!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఈ ముద్దుగుమ్మ ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ సరసన నటించింది. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ‘లస్ట్ స్టోరీస్’ మూవీలో ఒక బోల్డ్ రోల్ కూడా చేసి భారతదేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. కాగా ఈ తార బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం నడుపుతున్నట్లు బీ-టౌన్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కలిసి గురువారం ఉదయం విమానాశ్రయంలో కనిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వీరిద్దరూ కలిసి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి.

ఒక వీడియోలో మొదటగా కియారా ఆ తర్వాత సిద్ధార్థ్ విమానాశ్రయంలో అడిగిపెట్టినట్లు కనిపించింది. న్యూ ఇయర్‌కి ఇంకా కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్ 31 నైట్ నుంచి ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఈ నేపథ్యంలోకి కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి ఒక ఫారిన్ దేశం వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల, కియారా, సిద్ధార్థ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంటి నుంచి ఒకేసారి బయటకు వెళ్తూ కనిపించారు. జనవరిలో వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కానున్నారనే పుకార్ల మధ్య ఇది జరిగింది. సిద్ధార్థ్, కియారా 2021 షెర్షా చిత్రంలో కలిసి పనిచేశారు. అప్పటి నుండి డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి.

ఈ స్టార్స్ తమ అఫైర్ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. నిర్మాత, డైరెక్టర్ కరణ్ జోహార్ తన టాక్ షో కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో ఈ విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా బయటపెట్టాడు. ప్రస్తుతం కియారా చెర్రీతో కలిసి RC15 అనే తెలుగు సినిమాతో పాటు సత్యప్రేమ్ కీ కథ అనే హిందీ సినిమాలో నటిస్తోంది.

 

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla