`ఎన్టీఆర్ 30` బీభ‌త్స‌మైన ట్రెండింగ్‌.. అయినా ప‌ట్టించుకోవ‌డం లేదు పాపం!

`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివతో తన తదుపరి సినిమాను చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో గత ఏడాది స‌మ్మ‌ర్ లోనే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మితం కానున్న ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపిక అయ్యాడు.

అయితే సినిమాపై అనౌన్స్‌మెంట్ వ‌చ్చి చాలా కాల‌మే అయినా.. ఇప్పటివరకు షూటింగ్ ప్రారంభం కాలేదు. అప్పుడు ఇప్పుడు అంటూ వార్తలు వచ్చాయి తప్పితే ఈ మూవీ సెట్స్ మీదకు మాత్రం వెళ్ళలేదు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు. దీనిపై సైతం ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. మ‌రోవైపు మూవీ అప్డేట్స్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

NTR 30 To Get More Delay
NTR 30 To Get More Delay

న్యూ ఇయర్ కి అయినా ఈ సినిమా నుంచి చిన్న అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ మేకర్స్ నుండి ఉలుకు పలుకు లేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ #NTR30 హ్యాష్ టాగ్ ను ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఎన్టీఆర్ 30 హ్యాష్ టాగ్ ను బీభ‌త్సంగా ట్రెండ్ చేస్తున్నా.. మేక‌ర్స్ ఫ్యాన్స్‌ను ఏ మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. మరి అభిమానుల ఆవేద‌ను అర్థం చేసుకుని న్యూ ఇయర్ కు ఎన్టీఆర్ 30 నుంచి మేకర్స్ ఏదైనా అప్డేట్ ఇస్తారా లేదా అన్నది చూడాలి. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీతో న్యూయార్క్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ అనంతరం ఎన్టీఆర్ ఇండియాకు రానున్నారు.