వావ్: అజిత్‌, బాల‌య్య‌, విజ‌య్ ఈ 3 సినిమాలు ఒకే సెంటిమెంట్‌తో వ‌స్తున్నాయ్‌…!

మ‌రి కోద్ది రోజులో సంక్రాంతి పండుగ రాబోతుంది. వ‌చ్చే సంక్రాంతికి సౌత్ భాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ వార్ జ‌ర‌గ‌బోతుంది. ఇక వ‌చ్చే సంక్రాంతికి టాలీవుడ్‌లో అగ్ర హీరోలు అయిన చిరంజీవి- బాల‌కృష్ణ త‌న సినిమాల‌తో ఒక రోజు గ్యాప్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. చిరు వాల్తేరు వీర‌య్య‌తో రాగా బాల‌య్య వీర‌సింహ‌రెడ్డి తో ముందుగా సంక్రాంతి యుద్ధం మొద‌లు పెట్ట‌బోతున్నాడు.

Chiranjeevi vs Balakrishna, వాల్తేరు వీరయ్య vs వీరసింహారెడ్డి:  ప్రీ-బిజినెస్‌లో మెగాస్టార్‌దే పైచేయి! - chiranjeevi waltair veerayya and  balakrishna veera simha reddy pre business details ...

అయితే ఈ రెండు తెలుగు సినిమాల‌తో పాటు మ‌రో రెండు డ‌బ్బింగ్ సినిమాలు కూడా పోటీపడుతున్నాయి. అందులో ఒక సినిమాను టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు వంశి పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తున్నాడు. ఆ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మ‌త దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అ సినిమాలో హీరోగా కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ న‌టిస్తున్నాడు. అ సినిమాను తెలుగులో వార‌సుడుగా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేస్తున్నారు.

Sankranti 2023 movies: పోటీకి సంక్రాంతి సినిమాలు.. మరి డేట్స్ ఎక్కడ..? -  Chitrambhalare

ఈ సినిమాతో పాటు కోలీవుడ్ మ‌రో స్టార్ హీరో అజిత్ న‌టించిన తెగింపు సినిమాను కూడా జ‌న‌వ‌రి 11న వ‌స్తోంది. ఇప్పుడు ఈ మూడు సినిమాలు కూడా దాదాపు ఒకే రన్ టైం లో వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రాలను అయితే ఓవర్సీస్ లో సినీ మార్క్ సినిమాస్ లో రిలీజ్ అవుతుండగా వారు అయితే ఈ మూడు సినిమాలు కూడా 2 గంటల 40 నిమిషాల నిడివి తోనే వస్తున్నట్టుగా కనిపిస్తుంది.

ఈ విష‌యంపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాలో వీరసింహా రెడ్డి, వారిసు చిత్రాలు జనవరి 11న యూఎస్ లో ప్రీమియర్స్ పడనుండగా… మన దగ్గర అయితే 12న రిలీజ్ కాబోతున్నాయి. అలాగే అజిత్ సినిమా జనవరి 10 నే ప్రీమియర్స్ తో స్టార్ట్ కానున్నట్టుగా టాక్.