ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ వారి పర్సనల్ ప్రాబ్లమ్స్‌ని బయటకి చెప్పుకోరు. వారి వ్యక్తిగత సమస్యలు, ఆరోగ్య సమస్యల గురించి ప్రేక్షకులకు తెలియకుండా దాచిపెట్టడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే అలా చెప్తే ప్రేక్షకులలో వారికి ఉన్న క్రేజ్ తగ్గిపోతుంది అని.. సినిమా అవకాశాలు రావు అని భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న హీరోయిన్స్ ని వారి సినిమాలలో పెట్టుకోడానికి దర్శక నిర్మాతలు ఇష్టపడరు. ఎందుకంటే మధ్యలో వారు హెల్త్ ప్రాబ్లం వల్ల సినిమా నుంచి తప్పుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది.
అయితే సమంత మాత్రం తన పర్సనల్ లైఫ్ గురించి తన అభిమానులతో షేర్ చేసుకోవడానికే ఇష్టపడుతుంది. ఈ ఏడాదిలోనే సామ్ తాను మైయోసైటిస్‌తో బాధపడుతున్నానని చెప్పడంతో అందరూ షాక్‌కి గురయ్యారు. ది ఫ్యామిలీ మాన్ 2 సినిమా, ఉ అంటావా మావ సాంగ్తో దుసుకుపోతున్న సమంత అనారోగ్య బారిన పడింది. ఇక నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత కూడా సమంత కెరీర్ ఇండస్ట్రీలో విజయవంతం గానే కొనసాగుతుంది.
అయితే తన జీవితంలో ఉన్న సమస్యలను కూడా దాచిపెట్టకుండా ఎంతో ధైర్యంగా బహిర్గతం చేసింది. అలా చెప్పడం ద్వారా ఛాన్సులు మిస్ అవుతాయని.. ప్రేక్షకుల్లో క్రేజ్ తగిపోతుందని సమంత ఏమాత్రం భయపడలేదు. ఈ ఏడాదిలో తన సమస్యను ఎట్టకేలకు బహిర్గతం చేయాలని సమంత నిర్ణయించుకోవడం అందరినీ మెప్పించింది. ఏదేమైనా సమంత పూర్తిగా కోలుకొని, మరెన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి అందరినీ అలరించాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.