ధ‌మాకాతో ర‌వితేజ లెక్క‌లు ఎలా స‌రిచేశాడో చూడండి…!

మాస్ మహారాజా రవితేజ ఈ సంవత్సరం మూడు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాగా.. అందులో ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు మాత్రం ప్రేక్షకును ఎంతగానో నిరాశపరిచాయి. అయితే ఆ రెండు సినిమాలలో రవితేజ మాత్రం ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించిన ఆ సినిమాలోని కథ, కథనం వీక్ గా ఉండడంతో అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఈ సంవత్సరం ప్లాప్‌లతో ఎండ్ చేయడం ఇష్టం లేని రవితేజ… తాజాగా వచ్చిన ధమాకా సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

మొదటి రోజు మొదటి ఆట నుంచి ధమాకాకు హిట్ టాక్ రావడంతో తొలి రోజు నుంచే అదిరిపోయే ఓపెనింగ్స్ ను రాబట్టింది. రెండో రోజు మూడో రోజు కూడా అదే అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. వీకెండ్ పైగా క్రిస్టమస్ కూడా కలిసి రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ధమాకా మ్యాజిక్ క్రియేట్ చేసింది.

🏆 Dhamaka Movie Download (Telugu) & Watch Online in OTT Platform 2022 -  Wiki In Hindi

ఈ సినిమాకు రిలీజ్ కు ముందు నుంచి పాజిటివ్ టాక్ రావటంతో కలెక్షన్స్ కూడా తొలి మూడు రోజుల్లోనే 30 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. రవితేజ ఈ సంవత్సరం తన నుంచి వచ్చిన రెండు ప్లాప్‌లను ఈ సినిమాతో మర్చిపోయేలా ధమాకాతో లెక్క సరిచేసి తన అభిమానులకు సినీ ప్రేక్షకులకు కమర్షియల్ హిట్ సినిమా అందించాడు.

వచ్చే నెలలో సంక్రాంతి వరకు పెద్ద సినిమా లేకపోవడంతో ధమాకా కలెక్షన్స్ మెల్లగా అప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది. మరి లాంగ్ రన్ లో ధమాకా కేవలం బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుందా ? లేకా డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుందా ? చూడాలి. వైజాగ్ లో మేకర్స్ సక్సెస్ సెలెబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ ఈవెంట్ తర్వాత కూడా ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.