ప్రాబ్లెమ్ చెబితే కడుపు చేశాడు… సంచలన వ్యాఖ్యలు చేసిన యాంకర్ లాస్య?

బుల్లితెర యాంకర్ లాస్య గురించి తెలుగు కుర్రాళ్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు లాస్య – రవి యాంకరింగ్ కాంబినేషన్ కి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. వీరి బుల్లితెర ప్రయాణంలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు అని తెలుగు ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు. అయితే ఎవరూ ఊహించని ఇధంగా లాస్య మంజునాథ్ ను ప్రేమించి పెళ్లి చేసుకోగా, రవి ఇంకొకరిని పెళ్లిచేసుకొని సెటిలైపోయాడు. ఇక ఆ తరువాత ఎవరి పర్సనల్ లైఫ్ లో వారు బిజీ అయిపోయారు.

ఇకపోతే, ఇపుడు వీరు వేరు వేరుగా బుల్లితెర ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు. ఒకానొక సందర్భంలో యాంకర్ రవి గురించి లాస్య సంచలన ఆరోపణలు చేయగా అప్పట్లో వైరల్ అయింది. అయితే ఆ తర్వాత రోజుల్లో రవి లాస్య మధ్య విభేదాలు తొలగిపోయాయి… అది వేరే విషయం. ఇకపోతే లాస్య ఇపుడు పలు బుల్లితెర షోస్ చేస్తూనే సోషల్ మీడియాలో కూడా హీరోయిన్స్ కి మల్లె చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఇన్స్టా వేదికగా లాస్య చేసిన పోస్ట్ అభిమానులకు షాకిచ్చేలా ఉండటంతో పాటు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

విషయం ఏమంటే… ఎప్పుడూ సాఫ్ట్ గా ఉండే లాస్య బోల్డ్ పోస్ట్ చూసి నెటిజన్లను ఒకింత ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. కొన్ని నెలల క్రితం రెండోసారి గర్భం దాల్చానని ప్రకటించిన లాస్య తాను గర్భం దాల్చడం గురించి ఆసక్తికర పోస్ట్ చేయడం విశేషం. అయితే ఆ పోస్ట్ లో పీరియడ్స్ వల్ల ఇబ్బంది కలుగుతోందని తన భర్తకి చెప్పగా…. ఆ బాధనుండి నిన్ను 9 నెలల పాటు కాపాడటానికే గర్భవతిని చేసానని చాలా కొంటెగా చెప్పాడట. ఇదే విషయం అమ్మడు వీడియో ద్వారా టెక్స్ట్ చేసి మరీ చెప్పుకొచ్చింది. దానికి నెటిజన్లు కూడా స్పందిస్తూ భగవంతుడు లాస్య కోరికను తీర్చాలని కామెంట్లు చేస్తున్నారు.