కృష్ణాలో ‘కాపు’ రాజకీయం..ఎవరికి లాభం?   

ఏపీలో కులాల పరంగా రాజకీయం చేసి ఓట్లని కొల్లగొట్టాలని అటు వైసీపీ, ఇటు టీడీపీలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇటీవల బీసీల పేరిట సభలు పెట్టి..బీసీ ఓట్లకు గేలం వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాపుల ఓట్లపై పడ్డారు. రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న కాపు ఓట్లని దక్కించుకోవడానికి రెండు పార్టీలు ట్రై చేస్తున్నాయి. అటు జనసేన సైతం కాపు ఓట్లపైనే ఆధారపడి ఉంది. ఇదే క్రమంలో తాజాగా వంగవీటి రంగా వర్ధంతిని వేడుకగా చేసుకుని కాపుల ఓట్లు కొల్లగొట్టే కార్యక్రమాలు చేశారు.

ఎవరికి వారు రంగా వర్ధంతి కార్యక్రమాలని చేశారు. గుడివాడ లాంటి చోట వైసీపీ..అధికార బలాన్ని చూపించింది..టీడీపీ రంగా వర్ధంతిని చేయడానికి వీలు లేదంటూ రాజకీయం చేసింది. అంటే కాపుల ఓట్ల కోసం వైసీపీ..టీడీపీని ఆపే ప్రయత్నం చేసింది..పైగా కొడాలి నాని లాంటి వారు..రంగాని చంపించింది టీడీపీ నేతలే అని, చంద్రబాబు కారకుడు అని కామెంట్ చేశారు.

అంటే కాపులు టీడీపీకి యాంటీ అయ్యేలా స్కెచ్ వేశారు. కానీ దీనికి టీడీపీ కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది..రాధా గతంలో రంగా హత్యతో చంద్రబాబుకు గాని, టీడీపీకి గాని సంబంధం లేదని, కొందరు వ్యక్తులు చేసినదాన్ని పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదని అన్నారు. ఆయన మాటలని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. పైగా రాధా ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు.

అయితే కాపు ఓట్ల కోసం కృష్ణాలో వైసీపీ వేసిన స్కెచ్ ఫెయిల్ అయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీకి కాస్త కాపులు యాంటీ అయ్యారు. పైగా టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే మెజారిటీ కాపు ఓట్లు వైసీపీకి దూరమవుతాయి.