తెలుగులో 100 సినిమాల‌తో సెంచ‌రీ కొట్టిన హీరోలు ఎవ‌రో తెలుసా…!

చిత్ర పరిశ్రమంలోకి ఎందరో హీరోలు వస్తుంటారు పోతుంటారు.. వారిలో కొంతమంది మాత్రమే స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకుంటారు.అయితే ఈ క్రమంలోనే ఇప్పటి తరం హీరోలు సంవ‌త్స‌రానికి ఒకటి రెండు సినిమాలు చేస్తూ తమ కెరియర్‌ను కొనసాగిస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే వీరు కెరియర్ మొత్తం మీద 40 నుంచి 50 సినిమాలు వరకు మాత్రమే నటించగలుగుతారు. మన పాత తరం సీనియర్ హీరోలు మాత్రం సంవ‌త్స‌రానికి నాలుగు నుంచి ఐదు సినిమాలు వరకు నటించేవారు.

అలా నటించిన వారిలో అతి తక్కువ టైమ్‌లో వందకు పైగా సినిమాలు చేసిన హీరోలు ఎంతో మంది ఉన్నారు వారు ఎవరు ఇప్పుడు చూద్దాం. ముందుగా నటసార్వభౌమ నందమూరి తారకరామారావు.. తెలుగు చిత్ర పరిశ్రమంలో వందకు పైగా సినిమాలు నటించిన వారిలో ఎన్టీఆర్ ఆగ్ర నటుడు. ఎన్టీఆర్ తన వందో సినిమాగా గుండమ్మ కథ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ సినిమాతో ఓ మెమొరబుల్ చిత్రాన్ని తెలుగు చిత్ర పరిశ్రమకు అందించాడు.

అయితే ఆ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి అప్పట్లో ఎన్టీఆర్‌కు పోటీగా అక్కినేని నాగేశ్వరరావు కూడా ఈ సినిమాలో నటించాడు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కూడా ఊరంతా సంక్రాంతి సినిమాతో త‌న కెరియర్ లో వందో సినిమా మైలురాయిని అందుకున్నాడు. ఈ సినిమా కూడా అక్కినేని కి సూపర్ హిట్ సినిమాలు ఒకటిగా నిలిచింది. మరో అగ్ర హీరో సూపర్ స్టార్ కృష్ణ కూడా చిత్ర పరిశ్రమంలో అతి తక్కువ సమయంలో 100 సినిమాలో నటించిన హీరోగా రికార్డును సృష్టించాడు.

అల్లూరి సీతారామరాజు సినిమాతో తన కెరియర్లో100 మైలురాయిని అధిగమించాడు. ఈ సినిమా అప్పట్లో కృష్ణ ఎవర్ గ్రీన్ సినిమాల్లో ఒక సినిమాగా నిలిచిపోయింది. మరో అగ్ర హీరో శోభన్ బాబు కూడా వందకు పైగా సినిమాలలో నటించాడు. ఆయన కెరియర్ లో 100వ‌ సినిమాగా వచ్చిన నిండు మనిషి ఆయన కెరీర్‌లో సూపర్ హిట్ సినిమాగా నిలిచి ఆ రోజుల్లోనే వంద రోజులు ఆడింది.

మరో ఎవర్ గ్రీన్ హీరో కృష్ణంరాజు కూడా తన కెరియర్ లో 100కు పైగా సినిమాలలో నటించారు. ఆయన కెరియర్ లో వందో సినిమాగా వచ్చిన రంగున్‌ రౌడీ.. మాత్రం ఆయనకు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఇక మరో నటుడు కమ్‌ హీరో మురళీమోహన్ కూడా తన కెరియర్ లో 100కు పైగా సినిమాలు లో నటించాడు. ఆయన వందో సినిమాగా వచ్చిన సినిమా వారాలబ్బాయి. మరో నటుడు క‌మ్‌ హీరో శరత్ బాబు కూడా తన కెరియర్ లో100కు పైగా సినిమాలలో నటించాడు. ఆయన కెరియర్ లో 100వ‌ సినిమాగా వచ్చిన తమిళ్ సినిమా చల్ల కుట్టి.

మరో స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా అతి తక్కువ సమయంలోనే 100కు పైగా సినిమాలు నటించాడు. అయ‌న కెరియర్ లో 100వ‌ సినిమాగా వచ్చిన సినిమా త్రినేత్రుడు. ఎన్నో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మరో హీరో నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ నట వారసుడుగా తెలుగు చిత్ర పరిశ్రమంలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ కూడా తన కెరియర్‌లో 100కు పైగా సినిమాలలో నటించారు. అయ‌న కెరియర్ లో 100 సినిమాగా వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

మ‌రో హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఇప్పటివరకు 500 పైగా సినిమాల్లో నటించారు. ఆయన మాయాబజార్ సినిమాతో 100వ‌ మైలురాయిని అధిగమించాడు. ఈ సినిమాతో ప్రేక్షకులను అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సూపర్ ఫామ్ లో ఉన్న రాజేంద్రప్రసాద్ కూడా అయ‌న‌ కెరియర్ లో 100కు పైగా సినిమాలలో నటించారు.

ఆయన చెట్టు కింద ప్లీడర్ అనే సినిమాతో 100వ మైలురాయిని అందుకున్నాడు. మ‌రోహీరో సుమన్ కూడా ఎన్నో సినిమాలో హీరోగా నటించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా కూడా నటించారు. సుమన్ కెరీర్ లో 100వ సినిమా అయ్యప్ప కటాక్షం. మరో హీరో సురేష్ కూడా తన కెరీర్ లో ఎన్నో సినిమాలో నటించాడు. ఈయన నటించిన 100వ సినిమా సూరిగాడు.

Choosodham Randi Movie || Climax Sentiment Scene || Srikanth,Jagapathi Babu,Rambha  - YouTube

అలాగే హీరో శ్రీకాంత్ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా ఎన్నో సినిమాలో నటించారు. శ్రీకాంత్ వందో చిత్రం మహాత్మ. ఇది యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అలాగే జగపతి బాబు కూడా 100కు పైగా సినిమాలో నటించినప్పటికీ 100వ చిత్రం కరెంటు తీగలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు.