కంటెంట్ తో పాటు క‌ర‌క్ట్ టైమ్ కూడా ముఖ్య‌మే.. `18 పేజెస్‌` నేర్పిన గుణ‌పాఠం!

యంగ్ అండ్ టాలెంటెడ్‌ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా న‌టించిన `కార్తికేయ 2` చిత్రం ఇటీవ‌ల విడుద‌లైన ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. మ‌ళ్లీ ఇదే కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న చిత్రం `18 పేజెస్‌`. ఈ చిత్రానికి స‌కుమార్ కథ అందించ‌గా.. ఆయ‌న శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వ‌హించాడు.

అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించాడు. డిసెంబ‌ర్ 23న విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది. కానీ, పోటీగా ర‌వితేజ న‌టించిన ధ‌మాకా` దిగ‌డం.. మాస్‌, క్లాస్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే విధంగా ఈ సినిమా ఉండ‌టంతో.. `18 పేజెస్‌` బాక్సాఫీస్ వ‌ద్ద పెద్దగా ప్ర‌భావం చూప‌లేక‌పోతోంది.

కంటెంట్ బాగున్నా రాంగ్ టైమ్ తో రావ‌డం ఈ సినిమాకు పెద్ద మైన‌స్ గా మారింది. రూ. 12.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా.. నాలుగు రోజుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 5.73 కోట్ల షేర్‌, రూ. 11.35 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను మాత్ర‌మే అందుకోగ‌లిగింది. టార్గెట్ ను రీచ్ అవ్వాలంటే ఇప్పుడున్న జోరు ఈ సినిమాకు ఏ మాత్రం స‌రిపోదు. ఏదేమైనా సినిమా హిట్ అవ్వాలంటే కంటెంట్ తో పాటు క‌ర‌క్ట్ టైమ్ కూడా ముఖ్య‌మే అన్న గుణ‌పాఠాన్ని నేర్పింది 18 పేజెస్‌.