బ్రహ్మాజీ: ట్రైలర్లో చూపించారు సినిమాలో లేపేశారు..!!

ప్రముఖ టాలీవుడ్లలో కమెడియన్గా నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు నటుడు బ్రహ్మాజీ. ఎప్పుడు విభిన్నమైన పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటారు. ఇక బ్రహ్మాజీ వయసు పెరుగుతున్న తన వయసుకు తగ్గ ఉండే పాత్రలలో కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన వేసి పంచ్ డైలాగులు సైతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా నిఖిల్ నటించిన 18 పేజీస్ సినిమా విషయంలో ఒక ఘోర అవమానం జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

18 పేజీ ట్రైలర్లో కనిపించిన బ్రహ్మాజీ సినిమాలో లేకపోవడంతో ఆయన అభిమానులు కాస్త ఫీలవుతున్నారు. పెద్ద సినిమాలలో నిడిది ఎక్కువైతే షూట్ చేసిన కొన్ని పాత్రలను డిలీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ట్రైలర్లో చూపించిన పాత్రను డిలీట్ చేయడం ఏంటని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఓవర్సీస్ ప్రింట్ లో బ్రహ్మాజీ కి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయని ఇండియాలో మాత్రం లేవని కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.

ట్రైలర్లొ కనిపించిన బ్రహ్మాజీ సినిమాలో ఎందుకు లేడా అంటు ఆయన అభిమానులు చిత్ర బృందాన్ని అడుగుతున్నారు.ఈ సినిమాలో బ్రహ్మాజీ నాలుగైదు సన్నివేశాలలో కనిపిస్తారని అయితే ఆ సన్నివేశాలు మొత్తం ఎడిటింగ్లో తీసేసినట్లు సమాచారం. తన సన్నివేశాలను తీసేయడం గురించి బ్రహ్మాజీ ఎలా స్పందిస్తారో చూడాలి.ఒక విధంగా ఇది కావాలని కుట్రపూరితంగా చేశారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కార్తికేయ -2 సక్సెస్ తర్వాత విడుదలైన 18 పేజీ సినిమా అంచనాలకు ఏమాత్రం అందుకోలేకపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.