నాగార్జున- బాలకృష్ణ మల్టీస్టారర్ ఆగిపోవడానికి కారణం అదేనా..!

ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. ఆ హీరోలు కలిసి నటిస్తున్నారంటే అభిమానులకు పండగే. తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళుగా భావించే నటరత్న ఎన్టీఆర్ మరియు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు.. ఈ ఇద్దరు అగ్ర హీరోలు ఎన్నో సినిమాలలో కలిసి నటించారు. ఈ ఇద్దరు దాదాపు 15 సినిమాలకు పైగా కలిసి నటించారు. వీరి నట వారసులుగా సినిమాల్లోకి వచ్చిన నాగార్జున- బాలకృష్ణ నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలు అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు.

ఈ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే బాలకృష్ణ తన కెరీర్ మొదటిలో అక్కినేని నాగేశ్వరరావు తో కలిసి రెండు సినిమాలలో నటించాడు. అదేవిధంగా నాగార్జున కూడా నందమూరి కుటుంబం అంటే ఎంతో గౌరవం ఉండేది. నాగార్జున కూడా నందమూరి హరికృష్ణతో కలిసి సీతారామరాజు సినిమాలో నటించారు.ఇదే క్రమంలో బాలయ్య- నాగార్జున కలిసి వారి తండ్రులు కలిసి నటించిన ఎవరీ గ్రీన్ సినిమా గుండమ్మ కథ రీమేక్ లో ఈ ఇద్దరి హీరోలు కలిసి నటించాలనుకున్నారు.

Gundamma Katha (1962) - IMDb

ఈ ఆలోచన ముందుగా నాగార్జునకు రాగా తర్వాత బాలకృష్ణని కూడా సంప్రదించగా అతను అంగీకరించగా సినిమా సెట్స్ మీదకు వెళుతున్నా సమయంలో అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఇక మళ్లీ 2011లో మలయాళం లో సూపర్ హిట్ అయిన క్రిస్టియన్ బ్రదర్స్ సినిమాను నాగార్జున- బాలకృష్ణతో రీమేక్ చేయాలని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెలకొండ సురేష్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో కూడా నాగార్జున- బాలకృష్ణ నటించడానికి ఒప్పుకున్నారు.

Nagarjuna-Balakrishna in mulitstarrer movie?

మళ్లీ ఈ సినిమా ఎందుకో గాని ముందుకు వెళ్ళలేదు. టాలీవుడ్ స్టార్ దర్శకులలో ఒకరైన బి.గోపాల్ హర హర మహాదేవ అనే సినిమాను ఈ ఇద్దరు హీరోలతో తెరకెక్కించాలని భావించారు. ఈ ప్రాజెక్టు కూడా ముందుకు వెళ్లలేదు. ఇలా ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించాలనుకున్న మూడు సినిమాలు మొదటి దశలోనే ఆగిపోయాయి.